న్యాచురల్ స్టార్ నాని, ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడిల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’. విడుదలకు ముందునుంచే అంతటా పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 14 రీల్స్ సంస్థ చేపట్టిన ప్రమోషన్స్, ట్రైలర్, ఆడియోతో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉందా? చూద్దాం..
కథ:
ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో కథ మొదలవుతోంది. చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే మహాలక్ష్మీ ప్రేమ గెలుచుకున్న కృష్ణ, ఆ విషయం ఆమె అన్న రామరాజుకు చెప్పలేక పదిహేనేళ్లుగా ఆ విషయాన్ని నానుస్తుంటాడు. మహాలక్ష్మీ తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయకుండా ఉండటం కోసం కావాలనే డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పండగ సెలవులకు రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్) పిల్లలు రాజన్న దగ్గరకు వస్తారు. వాళ్లంతా ఇంట్లో ఉన్న సమయంలో రాజన్న మీద ఎటాక్ జరుగుతోంది. ఆ ఎటాక్ నుంచి పిల్లలను తప్పించిన రామరాజు, వాళ్లను హైదరాబాద్ లోని రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్)కి అప్పగించమని కృష్ణకు చెప్తాడు.ఆ తరువాత హీరో ఎవరిని ఎదుర్కొంటాడో కథ ఎ మలుపు తిరిగిందో ఇక వెండి తేరా మీద చూడాల్సిందే.