Krishna Collections: రవితేజ- వినాయక్ ల ‘కృష్ణ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే..!

అగ్ర నిర్మాత డి.వి.వి దానయ్య సమర్పణలో ‘లక్ష్మీ నరసింహ విజువల్స్’ బ్యానర్ పై బి.కాశీ విశ్వనాథం నిర్మించిన చిత్రం ‘కృష్ణ’. ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి అనేది క్యాప్షన్. రవితేజ- వి.వి.వినాయక్ ల కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2008 వ సంవత్సరం జనవరి 12 న విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పోటీగా బాలకృష్ణ ‘ఒక్క మగాడు’ సినిమా ఉన్నప్పటికీ నిలదొక్కుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది ‘కృష్ణ’. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయ ప్రకాశ్ రెడ్డి ల కామెడీ బాగా పండింది.

నేటితో ఈ చిత్రం విడుదలై 14 ఏళ్ళు పూర్తికావస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.69 cr
సీడెడ్ 1.97 cr
ఉత్తరాంధ్ర 2.30 cr
ఈస్ట్ 1.12 cr
వెస్ట్ 1.04 cr
గుంటూరు 1.93 cr
కృష్ణా 1.29 cr
నెల్లూరు  1.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.63 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్  2.45 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.08 cr

‘కృష్ణా’ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.08 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకి ఈ చిత్రం రూ.6.08 కోట్ల షేర్ ను రాబట్టింది. రవితేజ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ‘కృష్ణ’ చిత్రం. రవితేజకి ఉన్న మాస్ ఇమేజ్ కు.. వినాయక్ కు ఉన్న మాస్ క్రేజ్ కు … ఇలాంటి సినిమా మరొకటి పడితే ‘కృష్ణ’ కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus