Krishna Vamsi: మహేష్‌తో సినిమా కష్టం… ఆ సినిమా చేద్దామని ప్రభాస్‌ పట్టుపట్టాడు!

  • February 28, 2024 / 12:16 PM IST

సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లకు రియాక్ట్‌ అయ్యి… రిప్లైలు ఇచ్చే దర్శకులు కొద్ది మందే ఉంటారు. అలాంటివారిలో క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణ వంశీ ఒకరు. ఇటీవల ఆయన వరుసగా సినిమాల గురించి, హీరోల గురించి సోషల్‌ మీడియాలో రియాక్ట్‌ అవుతున్నారు. అలా ఆయన ఇప్పటివరకు తారక్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అలాగే వాళ్లతో సినిమాలు చేయడం ఇప్పుడు అవుతుందా? గతంలో సినిమా చేసినప్పటి విషయాలను కూడా షేర్‌ చేసుకున్నారు.

కృష్ణవంశీ చేసిన అన్ని సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అందుకోకపోయినా… ఆ సినిమాల్లో నటీనటుల నటనకు మాత్రం మంచి మార్కులే వచ్చాయి. అలా ప్రభాస్‌ నటనకు మంచి పేరొచ్చిన సినిమాల్లో ‘చక్రం’ ఒకటి. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ నంది అవార్డు అందుకున్నారు కూడా. అయితే ఈ సినిమా వెనుక అసలు కథను ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్‌కు అది సరైన ప్రాజెక్ట్‌ కాదని ముందే చెప్పానని, కానీ స్టోరీ ఓరియెంటెడ్‌ సినిమా కావాలని ప్రభాస్‌ పట్టుబట్టి ఆ సినిమా చేశాడని కృష్ణ వంశీ (Krishna Vamsi) తెలిపారు.

‘చక్రం’ సినిమా ఐడియా నచ్చి అదే చేస్తాను అని ప్రభాస్ పట్టుపట్టాడు. అయితే మాస్‌ హీరో కాబట్టి ఇమేజ్‌కు తగినట్టుగా యాక్షన్ సీన్స్, ఒక ఫైట్ పెట్టించాం. కానీ సినిమా ఫలితం ఇబ్బందికరంగా మారింది అని చెప్పారు. అలాగే మహేష్‌బాబుతో చేసిన ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా విడుదలై 23 ఏళ్లయినా ఇప్పటికీ కథ, పాటల గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. ఈ క్రమంలోనే మహేశ్‌ బాబుతో మరో సినిమా ఎప్పుడు అని ఓ అభిమాని అడిగారు.

మహేశ్‌ బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్‌ స్టార్‌ కాబోతున్నాడు. అందుకే ఇప్పుడు ఆయనతో సినిమా కష్టం అని చెప్పేశారు. మరి ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా సీక్వెల్‌ను నాగ చైతన్యతో తీయొచ్చుగా అంటే సీక్వెల్‌ చేయలేనని బదులిచ్చారాయన. ఇటీవల ఎన్టీఆర్‌ హీరోగా సినిమా చేయొచ్చుగా అంటే… అతను ఇంటర్నేషనల్‌ స్టార్‌ అయిపోయాడని, ఇప్పుడు సినిమా కష్టం అని చెప్పేశారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus