Krishnam Raju: కృష్ణంరాజు స్నేహితుడు ఓసారి ఓర్వలేక చేసిన పని!

  • September 12, 2022 / 02:45 PM IST

కృష్ణంరాజు సినిమాల్లోకి వచ్చాక రెబల్‌ స్టార్‌ అయి ఉండొచ్చు. అయితే అంతకుమందు కూడా ఆయన రెబలే. అర్థం కాలేదా? సినిమాల్లోకి రాకముందు కూడా కృష్ణంరాజ్‌ ఫుల్‌ మాస్‌ అట. ఆయన యాక్టివ్‌నెస్‌, వే ఆఫ్‌ లైఫ్‌ చూసి చాలామంది కుళ్లుకునేవారట. కాలేజీకి వెళ్లే రోజుల్లో కృష్ణంరాజు జల్సాలు చూసి కొంతమంది కుళ్లుకునేవారట. అలా ఒక స్నేహితుడు ఏకంగా కృష్ణంరాజు తండ్రికే లేఖ్‌ రాశాడట. ‘నీ కొడుకు చెడిపోతున్నాడు.. చూసుకోండి’ అని అందులో రాశాడట. ఈ విషయాన్ని ఓ సారి కృష్ణంరాజే చెప్పారు.

కృష్ణంరాజుది ఉన్న‌త కుటుంబం. డ‌బ్బుకి ఎలాంటి లోటు లేదు. అందుకే జ‌ల్సాగా ఉండేవారట కృష్ణంరాజు. కాలేజీ రోజుల్లోనే ఖ‌రీదైన కార్లు, బైక్‌ల మీద తిరిగేవారట. అలా ఓసారి కృష్ణంరాజు జ‌ల్సాలు చూసి ఓర్వ‌లేని ఓ మిత్రుడు కృష్ణంరాజు తండ్రి ఉప్ప‌ల‌పాటి వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ‌కు ఆకాశ‌రామ‌న్న పేరుతో ఓ ఉత్త‌రం రాశాడట. ‘‘మీరు కష్ట‌ప‌డి డ‌బ్బులు పంపుతుంటే, మీ కొడుకు దర్జాగా జ‌ల్సాలు చేస్తున్నాడు, అర్జెంటుగా కృష్ణంరాజును దారిలో తెచ్చుకోండి. లేకపోతే చేయి దాటిపోతాడు’’ అని లేఖలో రాశాడట ఆ స్నేహితుడు.

అయితే చాలామంది తండ్రుల్లా కృష్ణంరాజు వాళ్ల నాన్న కోప్పడలేదట. కృష్ణంరాజుకి ఓ ఉత్త‌రం రాసి, దానికి ఆ ఆకాశ‌రామ‌న్న లేఖనీ యాడ్‌ చేశారట. “నీ గురించి ఎవ‌రో ఉత్త‌రం రాశారు చూడు. నువ్వు త‌ప్పులు చేస్తున్నావ‌ని అంటున్నారు. అయితే ఇవేవీ నేను న‌మ్మ‌డం లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు త‌ప్పు చేయ‌వు అని నాకు తెలుసు. తండ్రిగా నీకేం కావాలో అన్నీ ఇచ్చే బాధ్యత నాది. అయితే నీపై ఈర్ష్య ప‌డే అలాంటి స్నేహితుల‌కు దూరంగా ఉండు’’ అని రాశారట.

ఆ లెటర్‌ చ‌దివిన కృష్ణంరాజు బోరున ఏడ్చేశారట. అప్ప‌టి నుండి తండ్రికి త‌ల‌వొంపులు తీసుకురాకుండా ఉండాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారట. తన పిల్లల విషయంలోనూ కృష్ణంరాజు ఇలానే ప్రవర్తించారట. వాళ్లకు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చారట.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus