ఒకప్పటి స్టార్ హీరో కృష్ణంరాజు ఈరోజు కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఇదిలా ఉండగా ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ను 4 దశాబ్దాలుగా శాసిస్తున్నారు. రీ ఎంట్రీలో కూడా ఆయన ఇప్పటి స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అవి భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. అయితే మెగాస్టార్ గా చిరంజీవి అందరికీ తెలుసు.
కానీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఆయన సినీ రంగప్రవేశం చాలా మందికి తెలీదు. నిజానికి చిరంజీవి సినీరంగ ప్రవేశం వెనుక రెబల్ స్టార్ కృష్ణంరాజు హస్తం చాలా ఉంది. అది ఎలా అనే అనుమానం మీకు రావచ్చు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ లోని మొగల్తూరు కి చెందిన వ్యక్తులు. కృష్ణంరాజు కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్ గా చేశారు. ఆ టైంలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారితో పరిచయం ఉంది. ఆ టైంలో వెంకట్రావు గారు కానిస్టేబుల్ గా పనిచేసేవారు. కొన్నాళ్ళ తర్వాత కృష్ణంరాజు నటుడు అయ్యారు.
ఆ టైంలో ఆయన తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళారు కృష్ణంరాజు. అప్పుడు చిరంజీవి గురించి కృష్ణంరాజు కి తెలిసింది. చిరంజీవికి నటుడు అవ్వాలి అనే ఇంట్రస్ట్ కృష్ణంరాజు వల్లే కలిగింది. మళ్లీ కొంతకాలం తర్వాత చిరంజీవి కాలేజీలో నాటకాల్లో వేషాలు వేసేవారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు.. చిరంజీవిని నటుడిని చేయమని వెంకట్రావు గారికి చెప్పారు కృష్ణంరాజు. చిరంజీవి కూడా తన మనసులో మాట వెంకట్రావు గారికి చెప్పడం..
ఆయన చిరంజీవికి మూడేళ్ల టైం ఇవ్వడం..జరిగింది. అలా చిరంజీవి చెన్నై(అప్పట్లో మద్రాసు) నటనలో శిక్షణ తీసుకోవడం జరిగింది. పునాది రాళ్ళు చిరంజీవి కి మొదటి చిత్రం అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి మొదటి చిత్రం.కానీ ఇది కూడా విడుదల ఆలస్యం అవ్వడంతో ప్రాణం ఖరీదు మొదట రిలీజ్ అయ్యింది. మనవూరి పాండవులు చిత్రంలో కృష్ణంరాజు కూడా నటించారు. ఈ చిత్రంలో చిరంజీవికి ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా కృష్ణంరాజు గారే..! అటు తర్వాత పులి బెబ్బులి చిత్రంలో కూడా చిరంజీవి – కృష్ణంరాజు కలిసి నటించారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!