మా(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు కానీ ఈ టాపిక్ మాత్రం గత కొద్ది రోజులుగా ట్రెండింగ్లో ఉంది. ఇందులో పోటీ చేసే సభ్యులు ఎటువంటి వివాదాలు వద్దు అంటూనే మరో పక్క వివాదాలు పుట్టించేలా మాట్లాడుతూ వస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా ఎన్నికలు లేవు ఏకగ్రీవం అయిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. మా ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ నెలకొన్నట్టు తాజా సమాచారం.వివరాల్లోకి వెళితే..
‘మా’ కి చెందిన 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు అయిన కృష్ణంరాజు గారికి మరో లేఖ రాశారు. మెయిన్ టర్మ్ ముగిసిందని .. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా జరగాల్సిన ఎన్నికలు ఇంకా జరగలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి విధి విధానాలు లేకుండానే అసోషియేషన్ నడుస్తుందని వారు చెప్పుకొచ్చారు.కాబట్టి క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్న.. కృష్ణంరాజు గారు కీలక బాధ్యతలు చేపట్టి ఎన్నికలకు శ్రీకారం చుట్టాలని వారు లేఖలో పేర్కొన్నారు.
గురువారం నాడు ఈ నాడు ఈ విషయాల పై ఓ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో ‘మా’ కి చెందిన పెద్దలందరితో… కృష్ణం రాజు ఈ విషయం పై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మా అధ్యక్షులైన నరేష్ ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.