నాని సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఎక్కడంటే ?

డబల్ హ్యాట్రిక్ అందుకున్న నేచురల్ స్టార్ నాని .. ఇప్పుడు మరో విజయాన్ని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో “కృష్ణార్జున యుద్ధం” సినిమా చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో ఒక సామాన్య యువకుడిగా, సింగర్ గా కనిపించబోతున్నారు. వీరి పక్కన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 12 న రిలీజ్ కానుంది.

సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకి ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజా మ్యూజిక్ అందించారు. ఇప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయిన పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా పూర్తి పాటలను మార్చి 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆడియో రిలీజ్ వేడుకను తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. టీజర్ తర్వాత కృష్ణార్జున యుద్ధంపై  అంచనాలు పెరిగాయి. పూర్తి పాటలు విడుదలయిన తర్వాత క్రేజ్ మరింత పెరగనుంది. జెంటిల్ మ్యాన్ తర్వాత నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus