Krithi Shetty: మలయాళ త్రీడీ సినిమాలో కృతి శెట్టి

తొలి సినిమాలో నటనకుగాను ఇటీవల ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది బేబమ్మ ఉరఫ్‌ కృతి శెట్టి. ‘ఉప్పెన’తో వచ్చిన ఈ సుందరి.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. తెలుగులోనే ఆమె హవా కొనసాగుతోంది అనుకుంటుండగానే.. ఓ తమిళ ఛాన్స్‌ పట్టేసింది. ఆ వెంటనే ఇప్పుడు మలయాళం ఛాన్స్‌ కూడా కొట్టేసింది. అవును.. కృతి శెట్టి తొలి మలయాళం సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. కన్నడలో అవకాశం సంపాదిస్తే.. సౌత్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోతుంది.

టొవినో థామస్‌ సినిమాతో కృతి శెట్టి మలయాళంలో ఎంట్రీ ఇవ్వనుండి. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘అజయంతే రందం మోషణం’ అనే చిత్రంలో కృతి శెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా మొదలైంది. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న త్రీడీ చిత్రమిది. జితిన్‌ లాల్‌ దర్శకుడుగా.. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్‌, సురభి లక్ష్మీ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే కృతి పాత్ర బలంగానే ఉంటుందని సమాచారం.

ఇక సూర్య సినిమాతో కృతి తమిళ ఎంట్రీ ఇటీవలే ఇచ్చింది. ఇటు తెలుగులో అక్కినేని నాగచైతన్య – వెంకట్‌ప్రభు సినిమాల్లో నటిస్తోంది. అయితే కృతి రీసెంట్ ట్రాక్‌ రికార్డుల్లో హిట్లు కనిపించడం లేదు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్చ నియోజకవర్గం’, ‘ది వారియర్‌’ అంటూ వరుస ఫ్లాప్‌లు ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఇతర భాషల్లోనూ ఈ అమ్మడుకి అవకాశాలు రావడం పెద్ద విషయమే అని చెప్పాలి.

అయితే కృతికి ఈ మూడు తప్ప ఇంకా కొత్త సినిమాలేవీ రాలేదు. ఈ మూడు సినిమాలు ఇంత త్వరగా విడుదలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కృతి కొత్త సినిమా చూడాలంటే మనకు చాలా నెలలు పట్టేస్తుంది. ఆ మధ్య వరుసగా అవకాశాలు సంపాదించిన కృతి.. ఫ్లాప్‌లు రావడంతో జోరు తగ్గించింది అని చెప్పాలి. దాని ప్రభావమే కనీసం ఆరు నెలల వరకు ఆమె సినిమాలు లేకపోవడమే. సౌత్‌ తర్వాత నార్త్‌ వైపు వెళ్లాలని ఒకవేళ కృతి అనుకుంటే.. అక్కడ ఎలా రాణిస్తుందో చూడాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus