Kriti Sanon: ఆది పురుష్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి కృతి సనన్!

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ సందడి చేయగా సీతమ్మ పాత్రలో బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని విడుదలను తిరిగి వాయిదా వేశారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి టీజర్ ఎన్నో విమర్శలకు దారి తీసింది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రతోపాటు హనుమంతుడు రావణాసురుడి పాత్రలను పూర్తిగా మార్చేశారనీ,రామాయణాన్ని అవమాన పరుస్తూ ఈ సినిమా చేశారంటూ పెద్ద ఎత్తున ఈ సినిమా టీజర్ ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఈ విధంగా విమర్శలు రావడంతోనే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడం కోసమే ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోని ఈ వార్తలపై తాజాగా నటి కృతి సనన్ స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఆది పురుష్ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని, అయితే ఎవరూ కూడా టీజర్ చూసి సినిమాను అంచనా వేయకూడదు అంటూ ఈమె కామెంట్ చేశారు. ఈ సినిమాని చాలా గ్రాండ్ గా అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో మీ ముందుకు తీసుకురాబోతున్నామని ఈమె తెలియచేశారు.

ఈ సినిమాని డైరెక్టర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఇంకా మంచిగా మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ సినిమాను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేసారని తెలియజేశారు.మన పురాణాలను చరిత్రలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అంటూ ఈ సందర్భంగా ఈమె ఆది పురుష్ సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus