సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన మధ్యతరగతి మూలాలను ఎప్పటికి మర్చిపోనని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన కృతిసనన్. ప్రేమాభిమానాలు పంచే కుటుంబం, నిస్వార్థమైన స్నేహం తోడుగా ఉంటే ఎన్ని విజయాలు సాధించినా వ్యక్తిత్వంలో మార్పు రాదని పేర్కొంది. ఇప్పటికీ తాను ఢిల్లీ నుంచి వచ్చిన మధ్యతరగతి అమ్మాయిగానే ఫీలవుతానని కృతిసనన్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఆమె ఆదిపురుష్ లో సీతగా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆమె తన గతంలోని చేదు అనుభవాలను పంచుకుంటుంది. స్వతహాగా మోడల్ అవడంతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న అమ్మడు అక్కడ కెరీర్ మొదట్లో చాలా అవమానాలు అందుకుంది. మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం చేసిన కృతి సనన్ ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోయినా నాగ చైతన్యతో దోచెయ్ చేసింది అది కూడా ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ చెక్కేసింది.
స్వతహాగా మోడల్ అవడంతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న అమ్మడు అక్కడ కెరీర్ మొదట్లో చాలా అవమానాలు అందుకుంది. “చదువుకుంటూ మోడలింగ్ చేశా.. అలా యాడ్స్ లో నటించే అవకాశం వచ్చింది. బీటెక్ తర్వాత ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాను.. అక్కడ తెలిసిన వారు ఎవరు లేక ఒంటరిగా ఫీలయ్యా రెండేళ్ల పాటు అలానే ప్రయత్నాలు చేశా.. ఒక ర్యాంప్ షో లో ఒక కొరియోగ్రాఫర్ నన్ను అసభ్యంగా వేధించి.. అవమానించాడు.
అప్పుడే మోడలింగ్ మానేసి వెళ్లిపోదామనుకున్నాను. కానీ ఆ టైం లో అమ్మ ధైర్యం చెప్పింది. ప్రతి స్త్రీకి ఆర్థిక స్వాత్రంత్యం ఉండాలని అమ్మ చెప్పింది. అందుకే కష్టపడి ఆ ఒడిదుడుకులను ఎదుర్కొని ఇక్కడవరకు వచ్చి నిలబడ్డాను” అని చెప్పుకొచ్చింది (Kriti Sanon) కృతి సనన్.