క్షణం

తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్క వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతోన్న పీవీపీ సినిమా, మరోపక్క పూర్తిగా కొత్తదనమున్న చిన్న సినిమాలను కూడా నిర్మించే ఆలోచనతో ‘క్షణం’ అనే ప్రయోగాత్మక సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత కొద్దికాలంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మరి ఆ క్రేజ్‌ను నిలబెట్టేలా సినిమా ఉందా? చూద్దాం..

కథ :
రిషి (అడివి శేష్) అమెరికాలో సెటిలైన ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. అక్కడే జీవనం సాగిస్తూండే రిషి, అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్ అయిన శ్వేత (అదా శర్మ) నుంచి వచ్చిన కాల్‌తో ఆమెను కలిసేందుకు ఇండియా వస్తాడు. రిషి ఇండియా వచ్చేశాక శ్వేత, తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారన్న షాకింగ్ విషయాన్ని అతడికి చెప్తుంది.
ఆ పాపను వెతకడం కోసం రిషి, పోలీసులను ఆశ్రయిస్తే వారినుంచి కూడా సరైన స్పందన దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో రిషి, తానే స్వయంగా పాపను వెతికే ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ కిడ్నాప్ కథేంటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమే మిగతా కథ.

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus