Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Reviews » Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 20, 2025 / 01:35 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అక్కినేని నాగార్జున, ధనుష్ (Hero)
  • రష్మిక మందన్న (Heroine)
  • జిమ్ సార్భ్, సునయన (Cast)
  • శేఖర్ కమ్ముల (Director)
  • సునీల్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు (Producer)
  • దేవి శ్రీ ప్రసాద్ (Music)
  • నికేత్ బొమ్మిరెడ్డి (Cinematography)
  • కార్తీక శ్రీనివాస్ (Editor)
  • Release Date : జూన్ 20, 2025
  • శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ (Banner)

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి తెరకెక్కించిన చిత్రం “కుబేరా” (Kuberaa). నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika), జిమ్ సార్భ్ (Jim Sarbh) ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆసక్తి రేకెత్తించింది. మరి శేఖర్ కమ్ముల తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకునే ప్రయత్నంలో ఏమేరకు విజయం సాధించాడో చూద్దాం..!!

Kuberaa Review

Kuberaa Movie Review and Rating

కథ: దేశంలో అత్యంత కుబేరుడైన నీరజ్ (జిమ్ సార్భ్)కి బంగాళాఖాతంలోని ఆయిల్ & గ్యాస్ రిజర్వ్ గురించి తెలిసి, దాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకుంటాడు.

ఈ డీల్ లో భాగంగా పెద్దలకు లక్ష కోట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా, భవిష్యత్ లో ఎవరూ ట్రేస్ చేయకుండా పంచే బాధ్యతను దీపక్ (నాగార్జున)కు అప్పగిస్తాడు నీరజ్.

ఆ లక్ష కోట్లను దేవ (ధనుష్) ద్వారా అందరికీ దీపక్ ఎలా పంచాడు? ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “కుబేరా” కథాంశం.

Kuberaa Movie Review and Rating

నటీనటుల పనితీరు: నిజంగానే ధనుష్ తప్ప మరెవరూ దేవ అనే పాత్ర చేయలేరు. గుబురుపట్టిన జుట్టు, గెడ్డంతో తిరుపతి వీధుల మీద అడుక్కునే ధనుష్ ను చూడగానే ప్రేక్షకులు అవాక్కవుతారు. అమాయకత్వంతో కూడిన తెలివితేటలను ప్రదర్శించే బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన అతనికి మరిన్ని అవార్డులు తెచ్చిపెట్టడం ఖాయం.

నాగార్జున స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మళ్లీ తన సత్తా చాటుకున్నాడు. లుక్స్, మ్యానరిజమ్స్ విషయంలో శేఖర్ కమ్ములను పూర్తిగా నమ్మి, కనీస స్థాయి మేకప్ లేకుండా చాలా నేచురల్ గా, రియలిస్టిక్ గా కనిపించాడు నాగ్. దీపక్ పాత్ర ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ ఆఖరి గంటలో పేలవమైపోయింది కానీ.. లేకపోతే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది ఆ పాత్ర.

రష్మిక మందన్న మరోసారి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రతో మంచి హాస్యాన్ని కూడా పండించాడు శేఖర్. ఈ సీరియస్ థీమ్ కి ఒక చిన్నపాటి రిలీఫ్ ఇచ్చింది ఆమె పాత్ర. అలాగే.. ధనుష్-రష్మిక కెమిస్ట్రీ కూడా బాగుంది. కెమిస్ట్రీ అంటే హీరోహీరోయిన్ అనుకునేరు, ఇది అంతకుమించిన మంచి బాండింగ్.

జిమ్ సార్భ్ కి హేమచంద్రతో డబ్బింగ్ చెప్పించకుండా ఉండే బాగుండేది. ఆ వాయిస్ మాడ్యులేషన్ కారణంగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా రొటీన్ ఫీల్ కలిగింది. షాయాజీ షిండే పాత్ర చిన్నదే అయినా.. కథ గమనంలో కీలకపాత్ర పోషించింది.

Kuberaa Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: విలన్ ఇంట్రడక్షన్ సీన్ కి “నాది నాది” థీమ్ తో మొదలైన దేవిశ్రీప్రసాద్ సంగీతం సంరంభం. ఇక “నా కొడుకా” పాట థీమ్ ను ఎక్కడికక్కడ నేపథ్య సంగీతంగా మలిచిన తీరు విశేషంగా అలరిస్తుంది. చాలారోజుల తర్వాత దేవిశ్రీప్రసాద్ కొత్తగా వినిపించాడు. సందర్భానుసారమైన థీమ్ మ్యూజిక్ తో కథను వేరే లెవల్లో ఎలివేట్ చేశాడు.

నికేత్ బొమ్మిరెడ్డి సీమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకి కొత్త ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా కలర్ టింట్ & లైటింగ్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా తర్వాత నికేత్ బడా సినిమాటోగ్రాఫర్ల ఖాతాలో చేరతాడు.

కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది. మరి శేఖర్ కమ్ములతో ఎక్కువగా విబేధించలేక మిన్నకుండిపోయాడేమో అనిపించింది.

ఇక దర్శకుడు శేఖర్ కమ్ముల.. క్యాపిటలిజం, ప్రైవేటీకరణ, ప్రభుత్వం బాధ్యతారాహిత్యం వంటి వాటిపై సంధించిన సీరియస్ సెటైర్ ఈ చిత్రం. అందుకోసం “బెగ్గర్ వెర్సస్ బిలియనీర్” థీమ్ ను ఎంచుకున్న విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నిజానికి ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత థియేటర్ల నుండి బయటికి వస్తున్నప్పుడు “ఇది శేఖర్ కమ్ముల సినిమాయేనా?” అని ఆశ్చర్యపోతూ.. శేఖర్ ఇలాంటి సినిమా కూడా తీయగలడు అనే నమ్మకంతో కాసేపు సేదతీరాక. సెకండాఫ్ లో కథనం గాడి తప్పి ఎక్కడెక్కడికో వెళ్లడం అనేది నిరుత్సాహపరుస్తుంది.

రెగ్యులర్ & కమర్షియల్ సినిమా ఎండింగ్ లా ఉండకూడదు అనే తాపత్రయంతో శేఖర్ కమ్ముల & టీమ్ రాసుకున్న క్లైమాక్స్ ఈ సినిమాకి మైనస్ గా మారింది. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయలేరా అని ప్రశ్నించొచ్చు కానీ.. ఒక్కోసారి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా, అన్నీ వివరించి సినిమాను ముగించినప్పుడే ప్రేక్షకుడి ఈగో సాటిస్ఫై అవుతుంది. ఆ విషయంలో మాత్రం శేఖర్ కమ్ముల తడబడ్డాడు. ఆ ముగింపు మరియు సెకండాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే “కుబేరా” 2025 బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచేది.

Kuberaa Movie Review and Rating

విశ్లేషణ: “కుబేరా” చిత్రంలో శేఖర్ కమ్ముల ముష్టివాడి పాత్రలో చూపించింది సగటు భారతీయుడ్ని. కొన్నాళ్ల క్రితం రైల్వే టికెట్స్ ను పాన్ కార్డ్ తో కొనేవారు. ట్రైన్ బోగీల మీద జనాల సీటు నెంబర్, పేరుతోపాటుగా పాన్ కార్డ్ ను కూడా ప్రచురించేవారు. ఆ లొసుగును పసిగట్టిన కొందరు ఎవరెవరివో పాన్ కార్డులు మీద బంగారం కొనడం, ఫారిన్ ట్రాన్సాక్షన్స్ చేయడం గట్రా చేసేవారట. “కుబేరా” కథ దాదాపుగా ఆ సంఘటనలానే ఉంటుంది.

అయితే.. శేఖర్ కమ్ముల మార్క్ మేకింగ్ స్టైల్ & సెన్సిబిలిటీస్ ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపాయి. ముఖ్యంగా పాత్రల డీటెయిలింగ్ & కంటిన్యూటీ విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. 195 నిమిషాల రన్ టైమ్, సెకండాఫ్ స్క్రీన్ ప్లే “కుబేరా”లో మైనస్ గా నిలిచాయి. ఆ రెండు మైనస్ లను పక్కన పెడితే, సమాజానికి అవసరమైన కథగా “కుబేరా”ను చూడొచ్చు. ధనుష్, నాగార్జున నటన, నికేత్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రాన్ని హిట్ గా నిలిపాయి.

Kuberaa Movie Review and Rating

ఫోకస్ పాయింట్: బ్రతకడం కోసం బ్రతకాలని నేర్పించే కుబేరా!

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Dhanush
  • #DSP
  • #Kuberaa
  • #nagarjuna

Reviews

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Bigg Boss Agnipariksha: ‘బిగ్ బాస్ 9’ అగ్నిపరీక్షలో ఇన్స్పైరింగ్ స్టోరీస్.. వీళ్ళు హౌస్లోకి వెళ్లాల్సిందే..!

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

Coolie Collections: మొదటి సోమవారం కూడా పర్వాలేదనిపించిన ‘కూలీ’

trending news

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

14 mins ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

1 hour ago
War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

War 2 Collections: 2వ వీకెండ్ పై ప్రెజర్ ఎక్కువగానే పడింది

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

8 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

8 hours ago

latest news

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameswaran: బ్లాక్ మెయిల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్

3 hours ago
ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

ఈ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా?

4 hours ago
Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

5 hours ago
Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

11 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version