బిగ్‌బాస్‌4: వెళ్లిపోతూ కుమార్‌ సాయి పెట్టిన పేర్లివి!

బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను చాలామంది సినిమా టైటిళ్లతో పోలుస్తారు. అంతెందుకు గతవారం నాగార్జున కూడా అదే పని చేశాడు. ఈ వారం బిగ్‌బాస్‌ కొత్తగా ట్రై చేశాడు. ఇంటి సభ్యులను కూరగాయలతో పోల్చమన్నాడు. ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయిన కుమార్‌సాయిని ఏ కంటెస్టెంట్‌కు ఏ కూరగాయ బాగుంటుందో చెప్పమన్నాడు. మరి కుమార్‌సాయి ఎవరికి ఏం పేరు పెట్టాడో చూడండి.

ఆరియానాను ఉల్లిపాయతో పోల్చాడు కుమార్‌ సాయి. చిన్నగా కనిపించినా… చాలా పొరలు ఉంటాయి. అలాగే ఆరియానాతో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్నాయని చెప్పాడు. ఇక ఇంట్లో అరటి పండు అని అవినాష్‌ని అన్నాడు. ఇక అఖిల్‌ను కరివేపాకుతో పోల్చాడు. ఇంట్లో ఆడుతున్నా, కష్టపడుతున్నా ఫెయిల్‌ అవుతున్నావ్‌ అనే కారణం కూడా చెప్పాడు.

అమ్మ రాజశేఖర్‌ను కాకరకాయ అన్నాడు కుమార్‌ సాయి. ఆయన హాస్యంలో చేదు ఉన్నా.. హాస్యం మంచిదే అన్నాడు. అభిజీత్‌ను మిస్టర్‌ కూల్‌ అంటూ కీరతో పోల్చాడు. లాస్యను మొక్కజొన్నతో పోల్చిన కుమార్‌ సాయి… నోయల్‌ను క్యాబేజీతో పోల్చాడు. ఇంట్లో అటుఇటు తిరుగుతూ టైంపాస్‌లా ఉంటాడని సోహైల్‌ను పల్లీతో పోల్చాడు.

బయటకు హార్స్‌గా కనిపించినా… లోపల స్వీట్‌గా ఉంటుందని దివిని పైనాపిల్‌తో పోల్చాడు కుమార్‌ సాయి. కింగ్‌ ఆఫ్‌ ది హౌస్‌ ఎవరో చెప్పమని నాగార్జున వంకాయని చూపిస్తే… నాకు వంకాయ అంటే నచ్చదు కాబట్టి… అలాగే హారిక అంటే కూడా నచ్చదు కాబట్టి ఆమెను వంకాయతో పోల్చాడు. మెహబూబ్‌ను ఆలుగడ్డతో పోల్చాడు. ఆ తర్వాత బాయిల్డ్‌ ఎగ్‌తో కూడా పోల్చాడు. ఎగ్‌ త్వరగా తినేయాలి లేకపోతే వాసన వచ్చేస్తుంది. అలానే ఏమైనా అనిపిస్తే వెంటనే చెప్పేయ్‌ అంటూ మెహబూబ్‌కి సూచించాడు.

ఆఖరిగా ఈ వారం బిగ్‌బాంబ్‌ను అమ్మ రాజశేఖర్‌ మీద వేశాడు కుమార్‌ సాయి. ఈ వారం మొత్తం వాష్‌రూమ్స్‌ క్లీన్‌ చేయమని మాస్టర్‌ మీద బిగ్‌బాంబ్‌ వేశాడు. పెద్ద మనిషిగా మీరు చేసేయండి అన్నాడు కూడా. మరి మాస్టర్‌ ఇప్పటికి కూల్‌గా తీసుకున్నా… తర్వాత హర్ట్‌ అవుతాడా, ఏమైనా సెటైర్లు వేస్తాడా అనేది చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus