గత కొన్ని రోజులుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర 73 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో కుమారి ఆంటీ మాత్రం ఏకంగా 10 తులాల బంగారం కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ఆమె కొనుగోలు చేసిన బంగారు నగ విలువ ఏకంగా 8 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.
కుమారి ఆంటీ నెల నెలా స్కీమ్ ద్వారా డబ్బులు చెల్లించి ఈ బంగారు హారాన్ని కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవ్ చేసుకుంటూ బంగారు హారాన్ని కొనుగోలు చేశారు. కొన్ని వారాల క్రితం యూట్యూబ్ లో కుమారి ఆంటీ ఫుడ్ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేశారు.
కుమారి ఆంటీ భవిష్యత్తులో టీవీ షోలతో లేదా సీరియళ్లతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కుమారి ఆంటీ హాజరైతే మంచి రేటింగ్స్ వస్తున్నాయి. కుమారి ఆంటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఫుడ్ బిజినెస్ లో సైతం ఆమెకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయని భోగట్టా.
కుమారి ఆంటీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కుమారి ఆంటీకి సినిమా ఆఫర్లు వస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేస్తానని వెల్లడించన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి నిజంగానే ఫుడ్ టేస్ట్ చేస్తే మాత్రం కుమారి ఆంటీ దశ తిరిగినట్టేనని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.