Kumari Aunty: కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. అలా చెప్పడంతో?

బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వయంకృషితో కష్టపడి మంచి పేరును సొంతం చేసుకున్న వాళ్లలో కుమారి ఆంటీ ఒకరు. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న కుమారి ఆంటీ ఎమోషనల్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాకు ప్రపంచం తెలియదని నేను ఈ స్థాయికి చేరుకుంటానని అస్సలు అనుకోలేదని కుమారి ఆంటీ పేర్కొన్నారు. ఈ గుర్తింపు నేను ఊహించనిదని నేనేంటో నాకు తెలియదని ఆమె అన్నారు. సోషల్ మీడియా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిందని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నానని ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఆమె వెల్లడించారు. చేసే పనులను ఆత్మవిశ్వాసంతో చేయాలని ఆత్మవిశ్వాసం ముందుంటే విజయం సాధించవచ్చని కుమారి ఆంటీ తెలిపారు. చదువు లేదని బాధ పడవద్దని భక్తి, ముక్తికి చదువులెందుకని ఆమె కామెంట్లు చేశారు. ఆత్మశాంతి ఉంటే చాలని అదే దైవమని కుమారి ఆంటీ పేర్కొన్నారు.

ఆత్మవిశ్వాసంతో పని చేస్తూ ముందడుగులు వేస్తే మంచి జరుగుతుందని మా పెద్దలు చెప్పారని ఆమె పేర్కొన్నారు. పెద్దల మాట వింటే ఇప్పటికీ సక్సెస్ దక్కుతుందని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు. పెద్దల మాట వింటే విజయమే తప్ప ఫెయిల్యూర్ ఉండదని ఆమె అన్నారు. కుమారి ఆంటీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ స్టేటస్ వచ్చినా కుమారి ఆంటీ సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నారు.

కుమారి ఆంటీ (Kumari Aunty) అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కుమారి ఆంటీకి టీవీ షోలలో ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి. భవిష్యత్తులో సామాన్యుల కేటగిరీలో కుమారి ఆంటీ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కుమారి ఆంటీని అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus