Kurup: ‘కురుప్’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • November 12, 2021 / 12:57 PM IST

‘ఓకే బంగారం’ ‘మహానటి’ ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. తన తండ్రి కంటే తెలుగులో అతను ఎక్కువ క్రేజ్ నే సంపాదించుకున్నాడు. అతని నుండీ వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. కేరళ రాష్ట్రంలోని క్రిమినల్ సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్’ పై హీరో దుల్కర్ సల్మానే ఈ చిత్రాన్ని నిర్మించాడు.ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పడింది. బిజినెస్ కూడా బాగానే జరిగింది.

వాటి వివరాలని ఓసారి గమనిస్తే :

నైజాం  0.35 cr
సీడెడ్  0.10 cr
ఆంధ్రా(టోటల్)  0.15 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.60 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘కురుప్’ సినిమాకి రూ.0.60 కోట్లు బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.0.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కేవలం 200 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అవుతుంది ఈ చిత్రం. కాబట్టి.. రూ.0.75 కోట్ల టార్గెట్ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. కాకపోతే దుల్కర్ గత చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం కరోనా టైములో కూడా రూ.0.90 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. టాక్ ను బట్టి ఆ చిత్రం రిలీజ్ అయిన రెండో రోజు నుండీ థియేటర్స్ అలాగే షోలు కూడా పెంచారు. కాబట్టి ‘కురుప్’ కి కూడా పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus