పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన కుష్బూ
- April 11, 2017 / 12:35 PM ISTByFilmy Focus
కాటమరాయుడు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. . రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లపై సరదా సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అత్తారింటికి దారేదిలో నదియాతో సెంటిమెంట్ పండించిన త్రివిక్రమ్ ఇందులోనూ అలనాటి ఖుష్బూతో ఎమోషన్ సీన్స్ తో ఆకట్టుకోనున్నారు. ఆమె ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొంది.
“తొలి రోజున షూటింగ్ కి వెళ్లినప్పుడు స్కూల్ కి వెళ్లినట్టుగా అనిపించింది” అని సోషల్ మీడియాలో వెల్లడించింది. అంతేకాదు ఈ చిత్రంలో తన పాత్ర కీలకమైనది కావడం వల్లనే ఒప్పుకున్నానని వివరించింది. షూటింగ్ కోసం పది రోజుల పాటు కుష్బూ ఇక్కడే ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవుడే దిగివచ్చినా.. అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















