Kushboo: అజ్ఞాతవాసి రిజల్ట్ పై ఖుష్బూ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. 2018 సంవత్సరం జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు సైతం నచ్చలేదు. ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి ఫ్లాపైన సమయంలో పవన్ కొంత మొత్తం రెమ్యునరేషన్ ను వెనక్కిచ్చేశారు.

అజ్ఞాతవాసి ఫ్లాప్ రిజల్ట్ గురించి ఖుష్బూ మాట్లాడుతూ అజ్ఞాతవాసి మూవీ ఆశించిన ఫలితాన్ని ఎందుకు అందుకోలేదో నాకు అర్థం కాలేదని ఆమె అన్నారు. ఆ సినిమాలో పవన్ కు, నాకు మధ్య మ్యాజిక్ మిస్ అయిందని నన్ను, పవన్ ను తల్లీకొడుకులలా చూడలేకపోయారని ఖుష్బూ చెప్పుకొచ్చారు. ఈ కారణాల వల్లే అజ్ఞాతవాసి ఆడలేదని భావిస్తున్నానని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అయ్యాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటీమణులకు ఆఫర్లు పెరుగుతుండగా ఖుష్బూకు కూడా తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. రామబాణం సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ మూవీ సక్సెస్ సాధిస్తే ఖుష్బూకు ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది నటీమణులతో పోల్చి చూస్తే ఖుష్బూ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఖుష్బూ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఖుష్బూ (Kushboo) వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. ఖుష్బూకు తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది. ఖుష్బూను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఖుష్బూకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. కెరీర్ విషయంలో ఖుష్బూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus