నిడివి… ఓ సినిమా మీద దీని ప్రభావం ఎంత అంటే.. చాలానే అని అంటారు సినీ జనాలు. ఎందుకంటే బోర్ కొట్టకుండా సినిమా తీయాలి అంటే అయితే కంటెంట్ ఉండాలి, లేదంటే నిడివి తక్కువగా ఉండాలి అనేది పెద్దల మాట. ఈ క్రమంలోనే మన దగ్గర మూడు గంటల సినిమాలు తగ్గిపోయాయి, ఆ మాటకొస్తే రెండున్నర గంటల సినిమా అంటేనే ‘అంత సినిమానా’ అంటున్నారు. ఈ సమయంలో విజయ్ దేవరకొండ, సమంతల సినిమా ‘ఖుషి’ నిడివి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత ‘ఖుషి’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా అనుకున్నప్పుడు మామూలుగా అనుకున్నా ఇప్పుడు ఈ స్థాయి రిలీజ్ అంటున్నారు. విడుదల దగ్గరపడుతున్న వేళ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ బయటకు వచ్చింది. ‘ఖుషి’ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే పెద్దలతో పాటు కలసి పిల్లలు ఈ సినిమా చూడొచ్చు.
అయితే సినిమా రన్ టైమ్ మాత్రం 165 నిమిషాలు. అంటే పావు గంట తక్కువ మూడు గంటలు అన్నమాట. ఇప్పుడు ఈ విషయమే ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అంత సేపు జనాల్ని థియేటర్లలో ఈ సినిమా కూర్చోబెడుతుందా అని అంటున్నారు. ప్రేమకథలకు ఇలాంటి ఆప్షన్ తక్కువ అని చెబుతుంటారు. మాస్ సినిమాలకైతే ఐటెమ్ సాంగ్స్, ఫైట్స్, కామెడీ లాంటి అంశాలు ఉంటాయి కాబట్టి అంతసేపు ఎంగేజ్ చేయొచ్చు. మరి ‘ఖుషి’ లాంటి ప్రేమకథతో ఇది సాధ్యమేనా అని అంటున్నారు.
అయితే ‘ఖుషి’ (Kushi) సినిమాలో అలాంటి ఫీల్ ఉందని, ఎంతసేపైనా ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చోబెడుతుందని టీమ్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలకు మంచి స్పందన వచ్చింది. అవి కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతాయి అంటున్నారు. ఇక ‘ది’ విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ జనాలకు బాగా నచ్చుతుంది అని సమాచారం.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్