Kushi: ఆ ఏరియాలో వన్ మిలియన్ చేరువలో ఖుషి!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి.. సమంత హీరోయిన్‌. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీస్ నిర్మించింది. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 1న భారీగా విడుదలైంది. ట్రైలర్‌ను, టీజర్స్‌, పాటలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఖుషి సినిమా పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలోను కేక పెట్టిస్తోంది. అక్కడ జస్ట్ ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా 4 లక్షల డాలర్స్‌ని అందుకుంది.

అంతేకాదు ఫస్ట్ డేతో కలుపుకుని.. ఏకంగా ఆరు లక్షల ఏడు లక్షల డాలర్స్‌ను రాబట్టి.. వన్ మిలియన్‌కు చేరువలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 30 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే.. ఖుషి సినిమా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమా (Kushi) స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.

ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్, సమంతతో పాటు ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఖుషి తర్వాత విజయ్ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్‌తో సినిమా చేయనున్నారు.

ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. మృణాల్ హీరోయిన్‌గా చేస్తోంది. అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుని వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పక్కా ప్లానింగ్‌తో దిల్ రాజు ముందుకు పోతున్నారట.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus