విజయ్ దేవరకొండ,సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘హృదయం'(మలయాళం) ఫేమ్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లకి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. విజయ్ దేవరకొండ – సమంత ల మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ ని అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయం అనే నమ్మకాన్ని టీజర్, ట్రైలర్లు కలిగించాయి.
ఇక సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. విడుదలకి కొద్దిరోజులు ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ హడావిడి కూడా పెంచింది. ఇదిలా ఉండగా.. సినిమా విడుదల కాకుండానే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ రివ్యూస్ ఇచ్చే ఓ వ్యక్తి ఉన్నాడు. అతను ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు.
అతను మరెవరో కాదు ఉమైర్ సంధు. తాజాగా ఇతను ‘ఖుషి’ (Kushi) సినిమా వీక్షించినట్టు కూడా చెప్పి రివ్యూ ఇచ్చాడు. ఇది ఒక రొటీన్ అండ్ బోరింగ్ లవ్ స్టోరీ అని అతను రాసుకొచ్చాడు. ‘విజయ్ దేవరకొండ, సమంత ల జోడీ చూడడానికి బాలేదని.. సమంత వృద్ధురాలుగా కనిపించిందని .. డైరెక్షన్ సాగదీసినట్టు అనిపించిందని , మూలకథ కూడా చాలా వీక్ గా ఉందని, ఈ సినిమాకి వెళ్లకుండా మీ డబ్బులు సేవ్ చేసుకోండి’ అంటూ అతను పేర్కొన్నాడు.
ఫైనల్ గా అతను 5 కి 2 రేటింగ్ ఇస్తున్నట్టు కూడా ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఉమైర్ సంధు రివ్యూల గురించి అనుభవం ఉన్నవారు.. వీటిని పట్టించుకోరు. గతంలో అన్ని సినిమాలకి పాజిటివ్ రివ్యూలు ఇచ్చేవాడు. అప్పుడు జనాలు పట్టించుకోవడం మానేశారు అని ఇప్పుడు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!