2019 లో మలయాళంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది కానీ… బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు.తర్వాత అదే కథని చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ గా (Godfather) రీమేక్ చేయించారు. అది కూడా బాగానే ఆడింది. అయితే ‘లూసిఫర్’ సీక్వెల్ గా రూపొందిన ‘ఎల్ 2 – ఎంపురాన్’ ను(L2: Empuraan) మాత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
L2 Empuraan Collections:
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు (Dil Raju) రిలీజ్ చేశారు. దీంతో ఎక్కువ థియేటర్లు దక్కాయి. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ ఆశించిన నమోదు కావడం లేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘ఎల్ 2 – ఎంపురాన్’ (L2 Empuraan) సినిమాకు రూ.5.3 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.1.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.4.03 కోట్ల షేర్ ను రాబట్టాలి. గ్రాస్ పరంగా కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.