Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్… వింటేజ్ మణిశర్మ.. ఆచార్య ఫస్ట్ సింగిల్ అదుర్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చరణ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 13 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్రం టీజర్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

అయితే తాజాగా ఈ చిత్రం నుండీ విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆ అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి.‘లాహే లాహే.. ‘అంటూ సాగే ఈ సాంగ్ ను హారిక నారాయణ్ మరియు సాహితి చాగంటి చాలా ఎనర్జీతో పాడారు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అందరికీ హుషారు తెప్పించెలా ఉన్నాయి. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన ట్యూన్స్ అందరి చేత స్టెప్పులు వేయించెలా ఉన్నాయి. ఈ పాట వింటుంటే ఇంద్ర సినిమా నాటి రోజులు గుర్తుకురావడం ఖాయం.

13 ఏళ్ల తరువాత ఈ కాంబోలో వస్తున్న ఈ ఆల్బమ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పాట అయితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలి అనే విధంగానే ఉంది. మీరు కూడా ఓ సారి వినండి :


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus