Siddu Jonnalagadda: సిద్దూ సినిమా కోసం ఏకంగా 6స్టార్ కలవనున్నారా!

హీరో సిద్ధు జొన్నలగడ్డ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి కొన్ని చిత్రాలు చేశాడు. ఈ క్రమంలోనే ‘డీజే టిల్లు’ మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకోవడంతో పాటు ఫాలోయింగ్ కూడా భారీగా పెంచుకున్నాడు. ‘డీజే టిల్లు’ సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు దీనికి సీక్వెల్గా ‘టిల్లు స్కేర్’ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ ‘తల్లుమాల’ రీమేక్ చిత్రాల్లోనూ చేస్తోన్నాడు.

ఇలా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న (Siddu Jonnalagadda) సిద్ధు.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిస్ట్గా కాస్ట్యూమ్ డిజైనర్గా లిరిసిస్ట్గా సేవలు అందిస్తోన్న నీరజా కోన ఇప్పుడు డైరెక్టర్గా మారబోతున్నారట. ఆమె తన మొదటి చిత్రాన్ని సిద్దు జొన్నలగడ్డతో చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆమె ఈ యంగ్ హీరోకు స్టోరీని వినిపించగా.. దీనికి అతడు ఎంతో ఇంప్రెస్ అవడంతో పాటు వెంటనే ఒప్పుకున్నాడట.

తొలిసారి మెగా ఫోన్ పట్టబోతున్న నీరజ కోన.. ఫస్ట్ మూవీతోనే బిగ్ హిట్ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిద్ధు జొన్నలగడ్డ కోసం ఆమె ఓ యూత్ఫుల్ లవ్ స్టోరీని రెడీ చేశారని అంటున్నారు. త్వరలోనే మొదలయ్యే ఈ చిత్రానికి పనిచేయబోయే టెక్నీషియన్స్ వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. వారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ కావడం విశేషం.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, ఆర్డ్ డైరెక్టర్‌గా శర్మిష్ట రాయ్, మ్యూజిక్ తమన్, కొరియోగ్రఫీ బృంద మాస్టర్, కాస్టూమ్స్‌ డిజైనర్‌గా అర్చన రావు పనిచేయనున్నారు. వీళ్లందరూ నేషనల్ అవార్డ్ గెలుపొందినవారే. నిజానికి సిద్ధు ఒక అప్‌మింగ్ హీరో, మరోవైపు నీరజ కోనకు దర్శకురాలిగా ఇదే తొలి చిత్రం. అయితే ఇలాంటి కాంబినేషన్‌లో వచ్చే సినిమాకు ఇంత మంది టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటం పట్ల అసలు స్టోరీ లైన్ ఏంటనే చర్చలు మొదలయ్యాయి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus