అప్పులు ఇంకా తీర్చుతున్నా: మంచు లక్ష్మీ

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకి సినీ రంగంలో నటుడిగానే కాకుండా.. నిర్మాతగా మంచి అనుభవం ఉంది. ఆ రెండు విభాగాల్లో అతని కుమార్తె మంచు లక్ష్మి అడుగుపెట్టి తండ్రికి తగ్గ కూతురిగా నిరూపించుకుంది. అయితే అంత అనుభవం ఉన్నా, అండ ఉన్నప్పటికీ మంచు లక్ష్మి ని మోసం చేశారంటా..!. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన  w/o రామ్ సినిమా నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ తనకి జరిగిన మోసాన్ని బయటపెట్టింది. ” సినిమా నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు.  మనుషులు మోసం చేయడం వల్ల నష్టపోయాను.

గతంలో ‘గుండెల్లో గోదారి’ సినిమాతో అప్పులపాలయ్యాను. వాటిని ఇప్పటికీ తీరుస్తూనే ఉన్నాను. నేను తీసుకున్న ప్రతి రూపాయి తిరిగి ఇస్తాను. అప్పుల వల్లే మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నాను.  `వైఫ్ ఆఫ్ రామ్` విజయం సాధించి ..నా  అప్పులన్నీ తీరుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేసింది. మోహన్ బాబు గారి కూతురును ఎవరు మోసం చేస్తారని అనుకోవడం వల్లే చాలా మంది నన్ను సులభంగా మోసం చేశారని తెలిపింది. ఇంకా తాను హోస్ట్ గా చేస్తున్నమేము సైతం షో గురించి మాట్లాడుతూ.. “మేము సైతం అనే షో చాలామందికి ఉపయోగపడింది. దాని వల్ల ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. అయితే వారి ఆవేదన, కష్టాలు విని కొంత సమయం వరకు నాలో బాధ వర్ణనాతీతంగా ఉండేది. అది గమనించి మా నాన్నకు అస్సలు నచ్చేలేదట.. అందుకే షో ఆపేశాను” అని మంచు లక్ష్మి వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus