యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్య’. సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే యావరేజ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదల అయిన ‘లక్ష్య’ చిత్రానికి యవరేజ్ టాక్ అయితే వచ్చింది కానీ ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా నమోదయ్యాయి. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని… సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్ల పై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మించారు.
‘లక్ష్య’ 3 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 0.56 cr |
సీడెడ్ | 0.19 cr |
ఉత్తరాంధ్ర | 0.22 cr |
ఈస్ట్ | 0.09 cr |
వెస్ట్ | 0.08 cr |
గుంటూరు | 0.12 cr |
కృష్ణా | 0.14 cr |
నెల్లూరు | 0.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.59 cr |
‘లక్ష్య’ చిత్రానికి రూ.6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.అయితే 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.1.59 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.5.01 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తుంది. ‘అఖండ’ మ్యానియా వల్ల ‘లక్ష్య’ ని జనాలు పట్టించుకోలేదని క్లియర్ గా తెలుస్తుంది.
‘అఖండ’ నిన్న అంటే ఆదివారం రోజున రూ.3 కోట్ల పైగా షేర్ ను రాబడితే.. ‘లక్ష్య’ చిత్రం రిలీజైన మూడు రోజుల్లో కూడా అంత మొత్తం రాబట్టలేకపోయింది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!</strong