గుండు వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా?

  • August 26, 2022 / 04:05 PM IST

డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే డైలాగ్ వింటేనే మనకు వెంటనే లలిత జువెలర్స్ ఎండి కిరణ్ కళ్ళ ముందు కనపడతారు. ఈయన తన జ్యువెలరీ షోరూమ్ కి ఏ విధమైనటువంటి స్టార్ సెలబ్రిటీలతో ప్రమోట్ చేయకుండా ఆయనే కేవలం డబ్బులు ఊరికే ఎవరికీ రావు అనే డైలాగుతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈయన ఎప్పుడు మనకు గుండు లుక్ లోనే కనిపిస్తారు. ఈ విధంగా ఈయనని ఇలాంటి లుక్ లో చూసి అందరూ తన గుండు వెనుక కారణం ఏంటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ కుమార్ బాల్ హెడ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా యాంకర్ తనని ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడు ఇలాగే గుండుతో ఉంటారా.. ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కిరణ్ కుమార్ సమాధానం చెబుతూ.. గత 20 సంవత్సరాల క్రితం తాను తన కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లానని అందరిలాగే తాను కూడా తిరుపతిలో స్వామివారికి మొక్కు చెల్లించాలని తెలిపారు.

అంతకుముందు తనకు హెయిర్ చాలా బాగా ఉండేదని అయితే తిరుపతి వెళ్ళిన తర్వాత తన మొక్కు చెల్లించుకొని తిరిగి వచ్చానని తెలిపారు. అప్పటికే టీ నగర్లో తనకు షో రూమ్ ఉండేదని,షోరూం కి వచ్చిన కస్టమర్స్ అక్కడ ఎంప్లాయిస్ అందరూ కూడా గుండు చాలా బాగుంది అంటూ పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ ఇచ్చారని తెలిపారు. ఈ విధంగా అందరూ ఈ స్టైల్ చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడంతో అప్పటినుంచి తను హెయిర్ లేకుండా ఇలాగే ఉండిపోయానని తనకు,

ఇలా బాల్ హెడ్ బాగా సూట్ అయిందని చెప్పిన కారణంగానే తాను ఇలాంటి లుక్ లో కనిపిస్తున్నానని అంతకుమించి వేరే కారణం ఏదీ లేదంటూ ఈ సందర్భంగా ఈయన చెప్పిన ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా స్వయంకృషితో ఇలా పదవ తరగతి వరకు మాత్రమే చదువుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని నగరాలలోనూ ఈయన తన జువెలరీ షోరూమ్స్ ప్రారంభిస్తూ ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగడం ఎంతో మందికి స్ఫూర్తిగా ఉందని చెప్పాలి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus