Rajinikanth: రజనీ రాజకీయాల్లో సూపర్ పవర్ గా ఎదిగేవారన్న లత.. ఏమైందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ సినిమాలతో రజనీకాంత్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా రజనీకాంత్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలామంది భావించినా వేర్వేరు కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదనే సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్ భార్య లత తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్ లో నేను నిజమైన నాయకుడిని చూశానని ఆమె చెప్పుకొచ్చారు. బలమైన కారణంతో రజనీకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టలేదని లత అన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి రజనీకాంత్ రాజకీయాల్లో ఉండి ఉంటే సూపర్ పవర్ గా ఎదిగారని లత కామెంట్లు చేశారు. కొచ్చాడియాన్ చీటింగ్ కేసు గురించి ఆమె మాట్లాడుతూ సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించడానికి పెట్టిన కేసు ఇది అని లత చెప్పుకొచ్చారు.

సెలబ్రిటీలుగా ఉన్నందుకు మేము మూల్యం చెల్లించుకుంటున్నామని ఆమె తెలిపారు. ఈ కేసు పెద్దది కాకపోవచ్చు కానీ భారీగానే ప్రచారం జరిగిందని లత కామెంట్లు చేశారు. నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి మోసం జరగలేదని ఆమె పేర్కొన్నారు. పలు కథనాల్లో ప్రచురితమైన విధంగా ఆ డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదని లత అన్నారు. ఆ వ్యవహారం మీడియా వన్, సంబంధిత వ్యక్తుల మధ్య వ్యవహారమని లత అన్నారు.

ఇప్పటికే వాళ్లు ఆ సమస్యను సెటిల్ చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్నానని లత వెల్లడించారు. లత చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. (Rajinikanth) రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus