Jr NTR: ఎన్టీఆర్ ఇంటి వద్ద హంగామా చేసిన ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు తన 39వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో అభిమానుల హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సేవా కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే ఎన్టీఆర్ ఫాన్స్ ఈయన బర్త్ డే సెలబ్రేషన్ లను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు తారక్ పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి సమయంలో అభిమానులు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద అభిమానులు అత్యుత్సాహం చూపించారు.

ఇక ఎంతోమంది అభిమానులు తారక్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ తరలి వచ్చారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇంటి ముందుకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు ఆయన ఇంటి ముందు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ఇంటి నుంచి బయటకు రావాలని పెద్ద ఎత్తున కేకలు వేస్తూ..నానా హంగామా చేశారు. ఇలా అభిమానులు ఎన్టీఆర్ ఇంటి ముందు కేకులు కట్ చేసి డాన్సులు చేస్తూ హంగామా చేశారు.

ఈ క్రమంలోనే వాహనదారులకు, స్థానికులు ఎంతో ఇబ్బంది పడటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదుపు చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు.పోలీసులు ఎంతగానో ప్రయత్నించి వారిని అక్కడి నుంచి పంపించాలని ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏకంగా ఎన్టీఆర్ అభిమానులపై లాఠీచార్జి చేశారు. ఇలా పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో అభిమానులు అక్కడి నుంచి కదిలారు.

మొత్తానికి తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానుల పై లాఠీఛార్జ్ జరగడం బాధాకరం. అయితే అభిమానులు కూడా ఇలా అత్యుత్సాహం చూపించకుండా ఉండాల్సింది అంటూ పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక తారక్ పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీల నుంచి అభిమానులు వరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus