విశాల్ హీరోగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాఠీ’. ‘రానా ప్రొడక్షన్స్’ పై రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీని రమణ, నంద సంయుక్తంగా నిర్మించారు. సునైనా హీరోయిన్ గా నటించింది.కంప్లీట్ యాక్షన్ మూవీ ఇది.డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళ్, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.టీజర్, ట్రైలర్ లు బాగానే ఉన్నాయి కానీ సినిమా పై పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.
దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఎక్కువగా జరగలేదు. ఒకసారి ‘లాఠీ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 1.20 cr |
సీడెడ్ | 0.70 cr |
ఆంధ్ర | 0.90 cr |
ఏపీ +తెలంగాణ | 2.80 cr |
‘లాఠీ’ చిత్రానికి రూ.2.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.3.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చెయ్యాలి. విశాల్ సినిమాలు ఎలా ఉన్నా.. తెలుగులో బాగానే ఆడుతుంటాయి. కానీ ఈసారి కష్టం. ఎందుకంటే ‘అవతార్ 2’ ఫుల్ స్వింగ్ లో ఉంది. మరోపక్క రవితేజ ‘ధమాకా’ ’18 పేజెస్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల ‘లాఠీ’ ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.
అందుకే రూ.3 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. ఒకవేళ సూపర్ హిట్ టాక్ కనుక వస్తే లిమిటెడ్ రిలీజ్ కాబట్టి.. ఎక్కువగా షేర్ ను కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!