Lavanya Tripathi: ఆ విషయంలో వరుణ్ తేజ్ చాలా లక్కీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో రాంచరణ్ అల్లు అర్జున్ వంటి వారు ఇప్పటికే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ఇద్దరు హీరోలు కూడా తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక త్వరలోనే మరో మెగా హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

త్వరలోనే నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్నారు. వరుణ్ తేజ్ తో ఈమె వివాహం నిశ్చయమైన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరీ పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా మెగా ఇంటికి కొత్త కోడలు అడుగుపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో లావణ్య త్రిపాఠితో పాటు అల్లు స్నేహారెడ్డి అలాగే ఉపాసనని పోల్చి పలువురు నేటిజన్స్ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన అలాగే అల్లుకోడలుగా మరింత సొంతం చేసుకున్నటువంటి స్నేహ రెడ్డి కన్నా లావణ్య త్రిపాఠి ఒక విషయంలో చాలా గ్రేట్ అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఏ విషయంలో లావణ్య విషయానికి వస్తే ఉపాసన ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే.ఇక ఈమె ఇదే జాగ్రత్తలను కండిషన్స్ ని రామ్ చరణ్ విషయంలో కూడా పెడుతూ ఉంటారట.

ఇక రామ్ చరణ్ ఉపాసన చెప్పిన డైట్ తప్పనిసరిగా ఫాలో అవుతూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారని తనకు కాస్త ప్రేజర్ అయినప్పుడు కూడా ఒక పెగ్గు వేయటానికి అనుమతి లేదు అంటూ తెలుస్తుంది. ఇక స్నేహ రెడ్డి కూడా ఇదే కండిషన్స్ అల్లుఅర్జున్ విషయంలో కూడా అప్లై చేస్తారట అయితే ఈమె తన భర్తకు ఏదైనా పార్టీలకు వెళ్తే వేస్తూ చిల్ అవడానికి పర్మిషన్ మాత్రం ఇస్తారని తెలుస్తుంది. లావణ్య త్రిపాఠి మాత్రం ఈ విషయంలో పూర్తిగా భిన్నమని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇప్పుడు తాను ఎలాగ ఉన్నారో పెళ్లి తర్వాత కూడా తనకు ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయవచ్చు అంటూ ఫ్రీడమ్ ఇచ్చారని తెలియడంతో ఈ విషయంలో వరుణ్ తేజ్ ఎంతో లక్కీ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus