లావణ్య త్రిపాఠి.. అనవసరంగా రియాక్ట్ అయ్యిందా?

మార్కెట్ లోకి కొత్త స్టార్ వచ్చాడండోయ్…! కంగారు పడకండి ఇప్పటి వరకూ దాదాపు అందరి పెద్ద హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చేసారు. ఒకరిద్దరి కొడుకులు తప్ప. అలా అని కొత్త స్టార్ ఎంట్రీ ఇచ్చింది సినిమాల్లోకి కాదు… సోషల్ మీడియాలో హడావిడి చేయడానికి..! ఈ మధ్యన కొంత మంది చేసే సిల్లీ పనుల వల్ల.. సోషల్ మీడియాలో పాపులర్ అయిపోతున్నారు. నెటిజన్లు ట్రోల్ చేయడం వల్ల.. దానిని ఇలాంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ‘ఉప్పల్ బాల్’, ‘గద్వాల్ బిడ్డ’, అబ్బో ఈ లిస్ట్ చాలా పెద్దదే..! ఇదిలా ఉంటే.. ఈ లిస్ట్ లో తాజాగా జాయిన్ అయ్యాడు.. సునిశిత్. ఈ మధ్య ఇతను ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో ఇతను వాగిన వాగుడుకి.. నవ్వాలో.. కోప పడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు కి సినిమాలు లేకపోతే.. తాను చెయ్యాల్సిన ‘1 నేనొక్కడినే’ సినిమా సాక్రిఫైస్ చేసాడట. అంతేకాదు ఎన్టీఆర్ వంటి హీరోలకోసం సినిమాలు వదులుకొన్నాడట. అందుకే ఇతనికి ‘సాక్రిఫైస్ స్టార్’ అనే పేరు పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతటితో ఇతను ఆగలేదు.. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లిచేసుకున్నానని, తరువాత గొడవలు రావడంతో విడిపోయామని.. ఆ పెళ్లి ఫోటోలు కూడా అతని దగ్గర లేవంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఇలాంటి వాళ్ళు చేసే కామెంట్స్ కు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు..! కానీ లావణ్య త్రిపాఠి రియాక్ట్ అయ్యింది. అవును లావణ్య.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లని ఆశ్రయించి… సునిశిత్ పై కేసు పెట్టింది. అతని పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని వారిని కోరినట్టు తెలుస్తుంది. అయితే లావణ్య అభిమానులు మాత్రం.. అలాంటి వాళ్ళ పై రియాక్ట్ అయ్యి.. పాపులర్ చెయ్యడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకూ వెళ్తుందో చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus