Lavanya Tripathi: ఆ దోష పరిహారం కోసం పెళ్లికి ముందే ఆ పని చేశారా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది చివరిలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జాతకంలో దోషాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జాతకంలో దోషం ఉందని ఆ దోష పరిహారం చేయాలి అంటే వినాయకుడి పూజ తప్పనిసరిగా చేయాలి అంటే పంతులుగారు నాగబాబుకు తెలియజేశారట. దీంతో నాగబాబు తన కూతురి జీవితంలా కొడుకు జీవితం కాకూడదని ముందుగానే కొడుకు కోడలి చేత వినాయకుడి పూజ చేయించారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే కాబోయే వధూవరుల చేత వినాయక చవితి పండుగ రోజు తన ఇంట్లో ఈ పూజ చేయించారని సమాచారం.

ఇలా జాతకంలో దోషం కారణంగానే (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇంటికి వచ్చి వినాయక చవితి పండుగ రోజు వినాయకుడి పూజ చేసి దోష పరహారం చేసుకున్నారని తెలుస్తుంది. ఇక వీరిద్దరూ కలిసి వినాయక చవితి పండుగను జరుపుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలుస్తుంది. అయితే లావణ్య త్రిపాటి కేవలం పండుగ జరుపుకోవడం కోసమే అత్తగారింటికి వెళ్లలేదు.

జాతకంలో ఉన్న దోష పరిహారం నిమిత్తం పూజ చేయడానికి అక్కడికి వెళ్లారని తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా మిస్టర్ సినిమా ద్వారా కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి బంధం వరకు వెళ్తోందని తెలుస్తోంది. త్వరలోనే వివాహ వేదిక అలాగే వివాహపు తేదీ ఎప్పుడు అనే విషయాలను కూడా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus