Lavanya Tripathi: చిన్న మావయ్య అని పిలవండి.. లావణ్యకు ఫ్యాన్స్ రిక్వెస్ట్ ఇదే!

మెగా కుటుంబానికి కాబోయే కొత్త కోడలు లావణ్య త్రిపాఠికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్నారు. ఈ మధ్య కాలంలో లావణ్య త్రిపాఠికి సరైన సక్సెస్ దక్కలేదనే సంగతి తెలిసిందే. వరుణ్ తో పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు గుడ్ బై చెబుతారని టాక్ వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బ్రో టీజర్ కు నెటిజన్ల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

బ్రో టీజర్ కు ఇప్పటివరకు 31 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. బ్రో టీజర్ పవన్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులకు సైతం ఎంతగానో నచ్చింది. అయితే మెగా కుటుంబానికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి రివ్యూ ఇచ్చారు. “మీ ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడటం కన్నుల పండుగలా అనిపిస్తుంది.. టీజర్ అద్భుతంగా ఉంది” అని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్ ను చూసిన మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.

పవన్ ను లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) చిన్న మామయ్య అని పిలిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోడలు ఆన్ డ్యూటీ అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు బ్రో మూవీ విషయానికి వస్తే వినోదాయ సిత్తం రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి చూస్తే ఈ సినిమాలో చాలా మార్పులు చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బ్రో మూవీకి బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోందని పవన్ ఈ సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రో మూవీ ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ లు ఉండనున్నాయని ఆ సర్ప్రైజ్ లు ప్రేక్షకులను మెప్పించేలా ఉండనున్నాయని బోగట్టా.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus