విధి రాతలో అమ్మానాన్నలను దూరం చేసుకున్న ఎంతో మంది విద్యార్థులు ఈ గృహంలో చదివి ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడుతున్నారనే విషయం తెలుసుకున్న లావణ్య…. ఓరోజు వారితో సరదాగా గడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అనాథ విద్యార్థి గృహాన్ని సందర్శించి అక్కడి విశేషాలను వ్యవస్థాపకులు మార్గం రాజేశ్ ను అడిగితెలుసుకుంది. విద్యార్థుల జీవితాలు తనకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని ఆనందం వ్యక్తం చేసిన లావణ్య… విద్యార్థులతో కలిసి మధ్యాహ్నా భోజనం ఆరగించింది.
అనాథ విద్యార్థి గృహంలో పిల్లలకు కావల్సిన అత్యవసర మందులను కానుకగా అందించి మానవత్వాన్ని చాటుకుంటుంది. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ…. తమ కుటుంబంలో ఎవరు సినీ పరిశ్రమతో సంబంధం లేకున్నా….11 ఏళ్ల ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ మంచి నటిగా ఎదిగానని వివరించింది. తనకు అవకాశాలు ఇచ్చిన దర్శకులు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.