Lavanya, Varun: వరుణ్ తేజ్ హైట్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన లావణ్య.. వైరల్ అవుతున్న వీడియో!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారన్న వార్త మెగా అభిమానులను ఎంతో ఆనందానికి గురి చేసింది. ఇలా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తల గురించి వీరిద్దరు ఎక్కడ స్పందించలేదు అయితే జూన్ 9వ తేదీ వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇలా వీరినిచ్చితార్థం గురించి వార్తలు వచ్చిన మెగా ఫ్యామిలీ ఎక్కడ స్పందించలేదు.

నిశ్చితార్థానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉందనగా వరుణ్ తేజ్ టీమ్ వీరి నిచ్చితార్థం గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య ఎంగేజ్మెంట్ జరుపుకోబోతున్నారంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో వీరికి సంబంధించిన కొన్ని పాత వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ లావణ్య కలిసి నటించిన మిస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా (Lavanya) లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ హైట్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్ ఆరడుగుల ఆజానుబావుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే యాంకర్ ప్రశ్నిస్తూ వరుణ్ చాలా హైట్ ఉన్నారు మీరు ఆయన పక్కన చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతూ కొన్ని సన్నివేశాలలో వరుణ్ తో కలిసి నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డానని.

అయితే అలాంటి సీన్స్ చేసే సమయంలో కింద బాక్సులు వేసుకొని నటించాను అంటూ ఈ సందర్భంగా వరుణ్ తేజ్ గురించి తన హైట్ గురించి లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరూ కూడా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మొదలైందని తెలుస్తుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus