సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. తెలుగులో అనే కాకుండా మిగతా భాషల్లో కూడా సినీ ప్రముఖులు మరణిస్తూ వస్తున్నారు. వయస్సు సంబంధిత సమస్యలతో కొంతమంది, అనారోగ్య సమస్యలతో కొంతమంది, ఆత్మహత్య చేసుకుని ఇంకొందరు.. మరణిస్తూనే ఉన్నారు. ఇటీవల మళయాళ సీనియర్ నటి మీనా, భాను శ్రీ మెహ్రా సోదరుడు నందు వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.
Shyam Benegal
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో దర్శకుడు కన్నుమూయడం షాక్ ఇచ్చే అంశం వివరాల్లోకి వెళితే…ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ (Shyam Benegal) మృతి చెందారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా వయోభారంతో పాటు కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధపడుతూ వస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ముంబయిలోని అడ్మిట్ అయ్యారు. అయితే చికిత్స పొందుతూనే ఈరోజు ఆయన కన్నుమూశారు అని తెలుస్తుంది.
శ్యామ్ మరణ వార్తపై కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు చింతిస్తూ తమ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక 1934లో హైదరాబాద్, తిరుమలగిరిలో శ్యామ్ బెనగల్ జన్మించారు.ఆర్ట్ ఫిల్మ్స్‌లో సత్తా చాటిన దర్శకులలో శ్యామ్ బెనగల్ కూడా ఒకరు. ఈయన తెరకెక్కించిన ‘అంకుర్’ ‘నిశాంత్’ ‘మంథన్’ వంటి సినిమాలు ఎన్నో అవార్డులు దక్కించుకున్నాయి. అలాగే ఈయన పద్మ శ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ అవార్డులను శ్యామ్ బెనగల్ (Shyam Benegal ) దక్కించుకున్నారు