ఇండియన్ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం లతా మంగేష్కర్ కు కరోనా నిర్ధారణ కాగా స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించినప్పటికీ ఆస్పత్రిలో చేరి ఆమె చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రకటన వెలువడింది. అయితే నిన్న లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. వైద్యులు మెరుగైన చికిత్స అందించినా చికిత్సకు కోలుకోలేక లతా మంగేష్కర్ మృతి చెందారు.
లతా మంగేష్కర్ మరణ వార్త తెలిసి ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 36కు పైగా భాషలలో లతా మంగేష్కర్ పాటలు పాడారు. ఆమె ఎక్కువగా హిందీ, మరాఠీ భాషలలో పాటలు పాడారు. సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ వివాదాలకు మాత్రం దూరంగా ఉండేవారు. సెలబ్రిటీ అయినప్పటికీ అభిమానులకు చేరువగా ఉండే అతికొద్ది మందిలో ఆమె కూడా ఒకరు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చికిత్స తీసుకోగా గత రెండు రోజుల నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈరోజు ఉదయం 8 గంటల 12 నిమిషాలకు లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారని సమాచారం అందుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అభిమానులు లతా మంగేష్కర్ ను ప్రేమతో దీదీ అని పిలుచుకునేవారు. తన సినీ కెరీర్ లో లతా మంగేష్కర్ 25,000కు పైగా పాటలను పాడారు. ఆమె పాడిన పాటలలో వందల సంఖ్యలో పాటలు ఆణిముత్యాలుగా నిలిచాయి. తన గాన మాధుర్యంతో లతా మంగేష్కర్ శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు.
ఆమె పాడిన పాటలలో విదేశీ పాటలు కూడా ఉన్నాయి. విదేశాలలో కూడా లతా మంగేష్కర్ కు మంచి గుర్తింపు ఉంది. లతా మంగేష్కర్ లేరంటే గుండె పగిలినట్లుందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!