Ponniyin Selvan 2: ‘పీఎస్‌ 2’ నాలుగు గంటల సినిమానా.. మణి సార్‌… కష్టం సార్‌!

  • March 27, 2023 / 07:31 PM IST

(Ponniyin Selvan 2)  ‘పెద్ద’ సినిమా అంటే పెద్ద స్టార్లు, పెద్ద దర్శకుడు తీసిన సినిమా మాత్రమే కాదు.. ఎక్కువ నిడివి ఉన్న సినిమా కూడా. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు మన దగ్గర చాలా తక్కువగా వస్తున్నాయి అనుకోండి. అలా వచ్చిన సినిమాలకు మిక్స్‌డ్‌ ఫలితాలు వస్తున్నాయి కూడా. అయినప్పటికీ.. పెద్ద సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు వెనుకాడం లేదు. కారణం సినిమా బాగుంటే ఎంత నిడివి ఉన్నా చూస్తారు అనే ధైర్యం. ఇప్పుడు మణిరత్నం కూడా ఇలానే అనుకుంటున్నారా? అదేం డౌట్‌ అంటారా?

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ రెండో పార్టు తొలి పార్ట్‌ కంటే చాలా పెద్దది అంటున్నారు. తమిళనాడులో భారీ రికార్డులతో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది ‘పొన్నియిన్ సెల్వన్ 1’. తొలి సినిమా కథ నాన్‌ తమిళనాట పెద్దగా ఆడకపోయినా.. రెండో పార్టు విషయంలో టీమ్‌ చాలా నమ్మకంగా ఉంది. అసలైన స్టోరీ రెండో పార్టులోనే ఉంటుంది కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని టీమ్‌ నమ్ముతోంది. దీని కోసం సుమారు నాలుగు గంటల సినిమాను రెడీ చేస్తున్నారట.

ఇటీవల ఎడిట్‌ టేబుల్‌ మీద లెక్కలన్నీ తేల్చాక ఫైనల్ కట్ 3 గంటల 53 నిమిషాలు వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ ప్రకారం చూస్తే.. ఇది చాలా ఎక్కువ. ఒకప్పుడు ‘దాన వీర శూర కర్ణ’, ‘బెన్ హర్’, ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్’, ‘లగాన్’, లాంటి సినిమాలు ఇలా పెద్ద నిడివితో వచ్చాయి. అయితే వాటిని రెండేసి ఇంటర్వెల్స్ వేసి ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడలా చేయడం కష్టసాధ్యం. దానికితోడు అంత ఓపికలు ఇప్పటికి ఆడియన్స్‌కి లేవు అని చెప్పొచ్చు.

ఈ సమయంలో మణిరత్నం ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని తమిళ నెటిజన్లు అంటున్నారు. మరోవైపు సినిమాలో కనీసంలో కనీసం ఓ గంట కట్‌ చేస్తే మంచిది అని కొంతమంది సూచిస్తున్నారట. అవసరమైతే ఆ కట్‌ చేసిన కంటెంట్‌ను ఓటీటీలో ఇచ్చుకోవచ్చు అనే ఆలోచన చేస్తున్నారట. మరి మణిరత్నం ఏం చేస్తారో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus