కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడిందన్న సంగతి తెలిసిందే. ‘జిల్లా’ నుండి.. సినిమా సినిమాకి అది పెరుగుతూనే వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి విజయ్ నుండి వచ్చిన ‘వారసుడు’ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ‘లియో’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.
అంటే మరికొన్ని గంటల్లో అనమాట. ట్రైలర్ అయితే ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘లియో’ పై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకే తెలుగులో భారీ పోటీలో రిలీజ్ అయినప్పటికీ ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను ఒకసారి గమనిస్తే :
నైజాం
6.00 cr
సీడెడ్
2.20 cr
ఉత్తరాంధ్ర
2.40 cr
ఈస్ట్
0.95 cr
వెస్ట్
0.85 cr
గుంటూరు
1.20 cr
కృష్ణా
1.10 cr
నెల్లూరు
0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
15.40 cr
‘లియో’ (LEO) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.15.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే చాలా ఉన్నాయి.