‘మాస్టర్’ అంటూ విజయ్‌తో ఇప్పటికే ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు లోకేశ్ కనగరాజ్. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న చిత్రం ‘లియో’. తొలి సినిమా టైమ్‌కి లోకేశ్ ఓ మంచి దర్శకుడు. తన సినిమాలు సగటు తెలుగు సినిమాల్లా ఉండవు అని మాత్రం తెలుసు. అయితే ఇప్పుడు వేరు. లోకేశ్ ఏకంగా ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఓ లైన్‌ను బేస్ చేసుకుని దాని చుట్టూ సినిమాలు రాసుకుంటున్నారు. వాటిని అగ్ర హీరోలతో చేస్తున్నారు. దీంతో వచ్చే నెల రావాల్సిన ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలో సినిమా (Leo Movie) మీద ఉన్న అంచనాలను నిలుపుకునే లోకేశ్ కనగరాజ్ కష్టపడతున్నారు. అందులో భాగంగా సినిమా అన్‌కట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. సినిమా రా వెర్షన్ అంటే అన్‌కట్ వెర్షన్‌ను బ్రిటన్‌లో విడుదల చేస్తున్నట్లు పంపిణీ సంస్థ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. లోకేశ్ విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక్క విజువల్ కూడా ప్రేక్షకులు మిస్ కాకుడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
బ్రిటన్ సినిమా 12A (12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు) ఫ్రెండ్లీ వెర్షన్ రిలీజ్ చేస్తామని టీమ్ పేర్కొంది. విడుదలకు నెలపైనే సమయం ఉంది. దీంతో ఈ విషయంలో త్వరలో మరింత క్లారిటీ వచ్చే అవకాం ఉంది. అయితే ఇప్పటికే యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యింది. కేవలం 24 గంటల్లోనే 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి అని సమాచారం. అయితే భారత్‌లో ‘జీరో కట్స్’ వెర్షన్ విడుదలవ్వడం అసాధ్యం అంటున్నారు.
ఇప్పటికే సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘నా రెడీ…’ (Naa Ready)కు సెన్సార్ బృందం నుండి కొన్ని మార్పులు సూచించారు. ఈ పాటలో మద్యపానానికి సంబంధించిన లిరిక్స్‌ను తొలగించమని అడిగారు. ఆ పదాల స్థానంలో కొత్త పదాలు పెట్టాలని, హీరో సిగరెట్ కాలుస్తూ ఉన్న క్లోజప్ షాట్స్ నిడివి తగ్గించాలని సూచించారు. ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే అక్షరాల సైజ్‌ను పెంచాలని సెన్సార్ టీమ్ ఆదేశించింది.