సినిమా ఎంత అందం, అనందంగాగా ఉంటుందో, దాని వెనుక కష్టం కూడా అంత అందంగా, ఆనందంగా ఉంటుంది. అదేంటి కష్టం అందంగా ఉండటం అంటారా? సినిమాలకు పని చేసినవాళ్లను, పని చేస్తున్నవాళ్లను అడిగితే ఈ విషయం చెబుతారు. ఎందుకంటే కష్టంలో వచ్చే ఆనందం వారికి బాగా తెలుసు. తాజాగా అలాంటి పరిస్థితి ఎదుర్కొని… ఇంకా చెప్పాలంటే అలాంటి పరిస్థితులతో పోరాడి, నిలిచి, గెలిచిన సినిమా టీమ్ ‘లియో’ టీమ్. దీనికి సంబంధించిన వీడియోను టీమ్ ఇటీవల విడుదల చేసింది.
దక్షిణాదిలో తాజాగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘లియో’. విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా లోకేష్ కనగరాజ్ ఈ సినిమా తెరకెక్కుతోంది. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో ఇన్నాళ్లుగా సాగుతోంది. సినిమాలో మెయిన్ టీమ్‌పై అక్కడ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. దానికి సంబంధించిన పనుల్ని చూసే సినిమా టీమ్ పడ్డ కష్టాన్ని ఆ వీడియోలో చూపించారు. ఒక్కోసారి మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కూడా షూటింగ్ చేశామని టీమ్ వెల్లడించింది.
కశ్మీర్‌లో అంతటి కష్టమైన షెడ్యూల్ ఎలా చిత్రీకరించారు, దానికి టీమ్ ఎంత కష్టపడ్డారు అనేది కళ్లకు కట్టినట్లుగా వీడియోలో చూపించారు. తమ సిబ్బంది లేకపోయుంటే, వాళ్లు అంత కష్టపడకపోయుంటే.. సినిమా షూటింగ్ సజావుగా సాగేది కాదని వీడియో చూస్తే అర్థమవుతోంది. మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉదయాన్నే నాలుగు గంటల కల్లా లేచి, అంతా సిద్ధం చేసుకుని, ఎనిమిది గంటల కల్లా షూటింగ్‌కి రెడీ చేసేవాళ్లమని, ఇదంతా తమ దర్శకుడు తమకు ఇచ్చిన స్ఫూర్తితోనే సాధ్యమైంది అని కూడా చెప్పారు.
ఈ సినిమా కోసం పని చేసిన టీమ్ చాలావరకు కోలీవుడ్ నుండే అక్కడి వెళ్లారట. వారి పనితనం చూసి లోకల్ టెక్నీషియన్లు, వ్యక్తులు ఆశ్చర్యపోయారు. ఇక ఫ్యాన్స్ కోసం వీడియో ఆఖరున విజయ్‌ని కూడా చూపించారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో విజయ్ అదరగొట్టాడు అని చెప్పాలి. అయితే ఇందులో హీరోయిన్ ఎక్కడా కనిపించలేదు.