డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) ఆగస్టు 15 న రిలీజ్ కాబోతోంది. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) , రామ్ (Ram) కలయికలో రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అవడంతో ట్రేడ్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు బాగున్నాయి. అంచనాలు మ్యాచ్ చేసే విధంగానే ఉంటుందేమో సినిమా అనే ఫీలింగ్ ను కలిగించాయి. అయితే ఈ సినిమా విడుదలకి అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఈరోజు లైగర్ (Liger) సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలు అందరూ అత్యవసర సమావేశం అయ్యారు. అనంతరం చాంబర్ కి వెళ్ళి నిరసన తెలిపేందుకు కూడా రెడీ అయినట్లు సమాచారం. ఎందుకంటే.. ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ హక్కుల రూపంలో లైగర్ నష్టాలు భర్తీ చేస్తారేమో పూరీ అని బయ్యర్స్ ఆశించారు. కానీ పూరీ మాత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డికి అమ్మేసినట్టు ప్రకటించారు.
దీంతో బయ్యర్స్ హర్ట్ అయినట్టు తెలుస్తుంది. మరోపక్క ‘డబుల్ ఇస్మార్ట్’ బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఆ టైమ్లో నిర్మాత నిరంజన్ రెడ్డి .. దర్శకుడు పూరీకి హ్యాండ్ లోన్ ఇచ్చారు. ఆయన వల్లే సినిమా కంప్లీట్ అయ్యింది. అయితే ముందుగా ఈ సినిమాకి ఫైనాన్స్ చేసింది సుధీర్ అనే వ్యక్తి. ఆయన రూ.40 కోట్ల వరకు ఫైనాన్స్ చేసినట్టు సమాచారం.
ఈ క్రమంలో అతని పర్మిషన్ లేకుండా నిరంజన్ రెడ్డికి రైట్స్ ఇవ్వడంపై సుధీర్ అభ్యంతరం తెలుపుతున్నట్టు సమాచారం. మరి ఈ క్రమంలో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.