Lingusamy: దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ మాటలు.. మంటలు పుట్టిస్తాయా?

  • November 20, 2022 / 06:39 PM IST

సంక్రాంతి సీజన్‌ అనగానే ఏటా సినిమాల వార్‌ కచ్చితంగా ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటాపోటీగా వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. మధ్యలో ఒక చిన్న సినిమా కూడా ఉంటుంది అనుకోండి. అయితే వచ్చే సంక్రాంతి సీజన్‌ దక్షిణాది సినిమా పరిశ్రమల మధ్య వార్‌ వాతావరణం సృష్టిస్తోందా? అవుననే అంటున్నారు తమిళ సినిమా జనాలు. తాజాగా తమిళ దర్శకుడు లింగుస్వామి చేసిన వ్యాఖ్యలు అలాంటి పరిస్థితి వచ్చేలానే కనిపిస్తోంది.

2023 సంక్రాంతి సీజన్‌లో వార్‌ వాతావరణానికి కారణమవుతున్న సినిమా ఒకప్పటి తెలుగు సినిమా.. ఇప్పటి తమిళ సినిమా అయిన ‘వారిసు’ అలియాస్‌ ‘వారసుడు’. దిల్‌ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని టీమ్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అప్పట్లో దీనిపై ఎవరూ ఏం మాట్లాడలేదు. అయితే సంక్రాంతి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వచ్చేసేసరికి చర్చ మొదలైంది. తెలుగు సినిమాల మధ్యలో తమిళ సినిమా ఎందుకు అని అన్నారు.

సరిగ్గా ఇదే సమయంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది. గతంలో నిర్మాత దిల్‌ రాజు చేసిన వ్యాఖ్యలను కోట్‌ చేస్తూ.. సంక్రాంతికి తెలుగు సినిమాలకు థియేటర్లను కేటాయించడానికే ప్రాధాన్యం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ పని కష్టం అని అల్లు అరవింద్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దిల్‌ రాజు ‘వరిసు’ నిర్మాత కాబట్టి ఆయన ఎలాగూ వ్యతిరేకంగానే ఉంటారు. దీంతో ఏమవుతుందా అని టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది.

సరిగ్గా ఈ సమయంలోనే తమిళ దర్శకుడు లింగుస్వామి స్పందించారు. ‘‘ఈ పద్ధతి నాకు ఏమాత్రం నచ్చలేదు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించిన విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ‘వరిసు’కు ముందు.. తర్వాత అనేలా సినిమా పరిశ్రమ మారుతుంది. రెండు ఇండస్ట్రీల పెద్దలు కూర్చొని దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఇదే మరోసారి రిపీట్‌ అయితే తర్వాత ఏం చేయాలో మేమూ చూస్తాం’’ అని లింగుస్వామి ఫైర్‌ అయ్యారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus