టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ లో కూడా నటిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఘట్టమనేని ఫ్యామిలీలో మహేష్ బాబు తప్ప సంపాదించే వాళ్ళు ఎవ్వరూ లేరు.మహేష్ కు కూడా కృష్ణ సంపాదించి పెట్టింది అంటూ ఏమీ లేదు. ఇంకా ఆయన చేసిన అప్పులు చాలా వరకు మహేష్ తీర్చాడు. మహేష్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా కాలం చేశారు. కృష్ణ సోదరులు అయినట్టు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు..
లు ఎప్పుడో ఫేడౌట్ అయిపోయిన నిర్మాతలు. సో మహేష్ (Mahesh Babu) కు కూడా ఇప్పుడు అభిమానులు తప్ప బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. అయితే మహేష్ చేసిన తెలివైన పని.. తన బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టడం. మహేష్ కు ఉన్న 4 వ్యాపారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) ఏ.ఎం.బి సినిమాస్ : ఏషియన్ సునీల్ తో కలిసి ఏ.ఎం.బి మల్టీప్లెక్స్ ను ప్రారంభించాడు మహేష్. ఇందులో షాపింగ్ మాల్స్ తరఫున వచ్చే రెంట్లు, అన్నీ మహేష్ కె వెళ్తాయి. టికెట్ రేట్ల పైసలు మాత్రం ఏషియన్ సునీల్ అండ్ టీం కు వెళ్తుంది. అయినప్పటికీ మహేష్ ఆదాయం గట్టిగానే ఉంటుంది.
2) మహేష్ బాబు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉందని టాక్. చాలా స్థలాలపై పెట్టుబడులు పెట్టాడు.
3) నమ్రత పేరు పై హోటల్స్ వ్యాపారం కూడా మొదలుపెట్టాడు మహేష్.
4) అలాగే దుస్తులు, హాస్పిటల్స్ వంటి వాటిలో కూడా వాటాలు ఉన్నాయి.