కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ… అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ‘సన్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకి ‘ఐకాన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆమెతో పాటు ఈ సినిమాలో మరో 4 మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉంది.
మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయ్యింది. అలాగే జాన్వీ కపూర్ కూడా హీరోయిన్ గా చేసే అవకాశం ఉంది. వీరితో పాటు రష్మిక మందన కూడా ఇందులో నటిస్తుంది. ఆమెది నెగిటివ్ షేడ్స్ తో కూడుకున్న పాత్ర అని తెలుస్తుంది. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ – అట్లీ కలిసి మాస్ సినిమా కాకుండా సూపర్ నేచురల్ థ్రిల్లర్ చేస్తున్నారు. కాబట్టి.. వి.ఎఫ్.ఎక్స్ రూపంలో ఎక్కువ బడ్జెట్ అవుతుంది అని తెలుస్తుంది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి రూ.600 కోట్ల బడ్జెట్ అవుతుందట. అంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే.. రూ.1000 కోట్లు బిజినెస్ చేయాలి. ముఖ్యంగా థియేటర్ నుండి రూ.2000 కోట్లు రాబట్టాలి అనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది. ‘పుష్ప 2’ సినిమా రూ.2000 కోట్లు కలెక్ట్ చేసినట్టు వేసుకున్నారు కానీ.. అది అంత రాబట్టలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. 70 శాతం నార్త్ నుండే కలెక్ట్ చేసింది.
అల్లు అర్జున్ కి అక్కడ తిరుగులేని మార్కెట్ ఏర్పడింది. కానీ అట్లీ కూడా అక్కడ ‘జవాన్’ తో వెయ్యి కోట్ల సినిమా అందుకున్నాడు. అక్కడ ఓకే. కానీ మిగిలిన ఏరియాల్లో చూసుకుంటే.. ఈ ప్రాజెక్టుకి అంత బజ్ లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో చైనా, జపాన్ వంటి ఏరియాల్లో కూడా సత్తా చాటితేనే రూ.2000 కోట్ల టార్గెట్ అందుకుంటుంది. అక్కడ కూడా ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా ఆసక్తి లేనట్టే కనిపిస్తుంది. ఈ మైనస్..లను టీం మొదటి నుండి గుర్తిస్తే బాగుంటుంది. లేదు అంటే రూ.2000 కోట్లు కష్టమే.