తెలుగులో హిట్స్ వచ్చినా కానీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన హీరోయిన్లు వీళ్లే..!

సినిమా ఇండస్ట్రీలో నేమ్, ఫేమ్, స్టార్ డమ్ రావడం అంత ఈజీ ఏం కాదు.. వచ్చే వరకు ఒక రకమైన కష్టం అయితే.. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి మరింత కష్టపడాలి.. అందుకే తాటికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు.. హీరోలతో కంపేర్ చేస్తే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునేది అందుకే మరి.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని.. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టినా కానీ ఫేడౌట్ అయిపోయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు.. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

రిచా – నువ్వే కావాలి..

తరుణ్, రిచా ఇద్దరూ ఎంట్రీ ఇచ్చిన ‘నువ్వే కావాలి’ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. రిచా పేరు చెప్తే తెలియకపోవచ్చు కానీ ‘నువ్వే కావాలి’ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు.. తర్వాత తరుణ్ పక్కన చేసిన ‘చిరుజల్లు’ డిజాస్టర్ కావడం.. ఇతర సినిమాలు కూడా ఘోరంగా ఫెయిల్ అవడంతో ఫేడౌట్ అయిపోయిందామె.. పెళ్లి తర్వాత ఫ్యామిలీకే అంకితమైపోయింది రిచా..

అనిత – నువ్వు నేను..

‘నువ్వు నేను’ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అనిత.. ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’ వంటి సినిమాలు చేసింది కానీ తెలుగులో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయింది.. హిందీలో ‘తాళ్’, ‘కుచ్ తో హై’, ‘యే దిల్’, కృష్ణా కాటేజ్‘, ‘రాగిణి ఎంఎంఎస్’, ‘హీరో’ లాంటి మూవీస్ చేసింది.. ‘మొహబ్బతే’, ‘నాగిన్’ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.. 2013లో రోహిత్ అనే బిజినెస్ మెన్‌‌ని మ్యారేజ్ చేసుకుని ఓ బాబుకి తల్లి అయింది అనిత..

రీమాసేన్ – చిత్రం..

ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరో హీరోయిన్లుగా.. తేజ దర్శకుడిగా పరిచయమవుతూ సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘చిత్రం’.. తర్వాత రీమాకి వరుసగా ఆఫర్స్ క్యూ కట్టడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.. నాగార్జునతో ‘బావ నచ్చాడు’, బాలయ్యతో ‘సీమ సింహం’, ‘మనసంతా నువ్వే’, ‘అంజి’, ‘బంగారం’ లాంటి ఫిలింస్ చేసింది.. తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.. 2012లో వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న రీమా.. తన కెరీర్‌లో ‘యుగానికొక్కడు’ బెస్ట్ ఫిలిం అని చెప్పుకొచ్చింది..

రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్ ‘బద్రి’ తో ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. తర్వాత పవన్ డైరెక్షన్లో ‘జాని’ లో నటించింది.. అంతకుముందు ‘ఖుషి’ మూవీకి కాస్ట్యూమ్స్, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసింది.. పవన్‌తో ప్రేమ, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.. ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధమైన రేణు..రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ లో నటిస్తుంది..

నమ్రత – వంశీ..

నమ్రత శిరోద్కర్.. రియల్ లైఫ్ పార్ట్‌నర్ కాకముందు మహేష్ బాబు పక్కన ‘వంశీ’ మూవీలో రీల్ లైఫ్ పార్ట్‌నర్‌గా నటించింది.. తర్వాత చిరంజీవితో ‘అంజి’ చేసింది.. అంతకుముందు హిందీలోనూ సినిమాలు చేసిన నమ్రత, మహేష్ బాబుతో మ్యారేజ్ తర్వాత సినిమాలకు దూరమైంది..

వీరితో పాటు.. ‘స్టూడెంట్ నెం:1’ లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేసిన గజాల తర్వాత ‘అల్లరి రాముడు’, ‘తొట్టిగ్యాంగ్’, ‘విజయం’, ‘భరత సింహా రెడ్డి’ వంటి కొన్ని సినిమాలు చేసి కనుమరుగైపోయింది.. ‘ఇడియట్’ ఫేమ్ రక్షిత, ‘ఘర్షణ’ ఫేమ్ ఆసిన్, ‘మన్మథుడు’ అన్షు, ‘6 టీన్స్’ రుతిక, ‘సంతోషం’ గ్రేసీ సింగ్, ‘టక్కరి దొంగ’ లీసారే, ‘బన్నీ’ హీరోయిన్ గౌరీ ముంజల్, ‘దిల్’ నేహా, ‘ఆర్య’ అను మెహతా వంటి భామలంతా ఒకటి, రెండు సినిమాలతోనే హిట్ కొట్టినా తర్వాత తెరమరుగైపోయారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus