ఓటీటీలో రిలీజ్ అయ్యి తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్..!

గతంలో థియేటర్లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలు చూడటానికి జనాలు పెద్ద ఎత్తున థియేటర్లకి వెళ్లడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొత్త సినిమాలు అయితే థియేటర్లలో అయ్యాక.. ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కోవిడ్ టైం నుండి కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి కూడా..! ఇదిలా ఉండగా.. తాజాగా మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

మే 23న నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే దీనికి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ నమోదవ్వడం జరిగింది. ఓటీటీలో ఘన విజయం సాధించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి రెడీ అయ్యింది. థియేటర్లలో ఆ సినిమాని చూస్తారా లేదా అన్నది తర్వాత. అయితే గతంలో కూడా ‘వి’ ‘ఆకాశం నీ హద్దురా’ ‘డర్టీ హరి’ ‘కలర్ ఫోటో’ ‘నారప్ప’ వంటి చిత్రాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ తర్వాత ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్లలో కూడా రిలీజ్ అయ్యాయి.

ఓటీటీ సంస్థల వద్ద అనుమతి తీసుకుని.. వాటిని థియేటర్లలో ఒకటి, రెండు రోజుల పాటు ప్రదర్శించడం జరిగింది. మనోజ్ బాజ్ పాయ్ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ సినిమా థియేటర్లలో కూడా పాజిటివ్ రిజల్ట్ ను అందిస్తే.. ఎన్నో సినిమాలు బ్రతకడానికి మార్గం చూపినట్టు అవుతుందని చెప్పాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus