తెలుగు సినిమాకు అతిపెద్ద సీజన్ ఏది అంటే.. సంక్రాంతి అని చెప్పాలి. ఆ టైమ్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఎలాంటి సినిమాలు వచ్చినా మినిమమ్ విజయం పక్కా అని అంటుంటారు. అయితే ఇప్పుడు డిసెంబరు కూడా అలానే మారింది. ఏడాది ఆఖరులో కూడా వరుస సినిమాలు వస్తున్నాయి. అలా ఈ ఏడాది కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. అందరికీ తెలిసినట్లే 12వ నెల ప్రథమార్ధంలో ‘పుష్ప’రాజ్ ‘రూల్’ (Pushpa 2: The Rule) ఉండబోతోంది. డిసెంబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Movies
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. సినిమా ఎఫెక్ట్ అయితే రెండు వారాలు కనీసం ఉంటుంది. అందుకే మూడో వారం నుండి సినిమాలు థియేటర్ల వద్దకు క్యూ కట్టబోతున్నాయి. అవేంటి అనేదే ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదికిపైనే సినిమాలు ఉన్నాయి. డిసెంబరు రెండో వారంలో అంటే 14న వేదిక – హరిత గోగినేని (Haritha Gogineni) ‘ఫియర్’ (Fear) రాబోతోంది. డిసెంబరు 20న అల్లరి నరేశ్ (Allari Naresh) ‘బచ్చలమల్లి’తో (Bachhala Malli) వస్తున్నాడు.
మహేష్ బాబు (Mahesh Babu) వాయిస్ అందించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’, రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మనవరాలు బేబీ తేజస్విని నటించిన ‘ఎర్రచీర’ 20న తీసుకొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) ‘మ్యాజిక్’ అనే చిన్న సినిమా కూడా ఉంది.
అయితే ఈ సినిమా డిసెంబరు 21న వస్తోంది. ఇక డిసెంబరు 25న నితిన్ (Nithiin) – వెంకీ కుడుముల (Venky Kudumula) ‘రాబిన్ హుడ్'(Robinhood) వస్తోంది. వెన్నెల కిశోర్ (Vennela Kishore) ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) డిసెంబరు 25న విడుదల కానుంది. ఇక డిసెంబర్ 27న ‘పతంగ్’ అనే చిన్న సినిమా కూడా వస్తోంది.