పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన ‘మహోంజదారో’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇది ఆమెకు చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. అటు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన ‘డీజే’ మూవీ ఈమెకు బ్రేక్ ఇచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ పూజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ మూవీలో ఏమైనా హైలెట్ ఉందా అంటే అది పాటలు, పూజా గ్లామర్ అనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
బాలీవుడ్లో కూడా ఈమె నటించిన ‘హౌస్ ఫుల్ 4’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుండి తెలుగు తమిళ హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ బ్యూటీ. ఈమె కెరీర్లో రూ.100 కోట్లు పైగా వసూల్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) డీజే (దువ్వాడ జగన్నాథం) :
అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
2) అరవింద సమేత :
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.158 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
3) మహర్షి :
మహేష్ బాబు- వంశీ పైడిపల్లి – పూజా హెగ్డే హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.168 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
4) అల వైకుంఠపురములో :
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
5) రాధే శ్యామ్ :
ప్రభాస్ – పూజా హెగ్డే – రాధా కృష్ణకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.205 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
6) బీస్ట్ :
విజయ్ – నెల్సన్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
7) హౌస్ ఫుల్ 4 :
పూజా హెగ్డే బాలీవుడ్లో చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
8) మహోంజదారో :
హృతిక్ రోషన్ – పూజా హెగ్డే కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.108 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
9) రంగస్థలం :
రాంచరణ్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.225 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
10) ఎఫ్ 3 :
వెంకటేష్ – వరుణ్ తేజ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో నర్తించింది. బాక్సాఫీస్ వద్ద రూ.118 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.